Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిజెపి ఆఫర్: చించేయమన్న సొట్టబుగ్గల ప్రీతి (పిక్చర్స్)

న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర కృషి చేస్తోంది. తమ ప్రయత్నాలకు తోడు గ్లామర్‌ను కూడా నమ్ముకుంటోంది. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. ఆ పార్టీ ఇతర నేతలు కూడా ప్రచారంలో తలమునకలయ్యారు. మరోవైపు వచ్చే ఎన్నికలలో బరిలో దింపే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్లామర్ వైపు దృష్టి సారిస్తున్నారు.

మన రాష్ట్రంలో కృష్ణం రాజు, కోట శ్రీనివాస రావు తదితరులు ఆ పార్టీ వైపు ఉన్నారు. శరత్ బాబును విశాఖ నుండి పోటీ చేయాలని బిజెపి నతేలు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోను గ్లామర్ వైపు బిజెపి చూస్తోంది. బప్పీల హరి వంటి వారు కొంతకాలం క్రితం బిజెపిలో చేరారు. మేఘనా పటేల్, రాఖీ సావంత్ వంటి నటులు బిజెపి కోసం ప్రచారం చేస్తున్నారు. అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, ప్రీతి జింటా వంటి వారికి బిజెపి ఆఫర్ చేస్తోంది.

ప్రియా దత్ పైన ప్రీతిజింటాను పోటీ చేయమని బిజెపి కోరిందట. బిజెపి కోరిన మాట నిజమో అబద్దమో కానీ ప్రీతి మాత్రం వాటిని కొట్టి పారేసింది. ఆ సొట్టబుగ్గల సుందరి మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా లేదట. తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఓ అభిమాని అడగటంతో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది ఎక్కడ చదివారని, అది వందశాతం అబద్దమని, ఆ వార్తను చించి వేయాలని సూచించారు.

గ్లామర్ వైపు చూస్తున్న బిజెపి

గ్లామర్ వైపు చూస్తున్న బిజెపి

ప్రముఖ బాలీవుడ్ నటి, ఓ ఐపిఎల్ జట్టు యజమాని అయిన ప్రీతి జింటా రానున్నా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్నారా? సినిమాలు, ఐపిఎల్ తర్వాత ప్రీతి జింటా ఇప్పుడు రాజకీయాలలో తన అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు సిద్ధపడుతున్నారా? అనే చర్చ బాలీవుడ్లో నిన్నటి వరకు చక్కర్లు కొట్టింది.

ప్రీతి జింటాకు రూడీ పిలుపు

ప్రీతి జింటాకు రూడీ పిలుపు

సమాచారం మేరకు... రానున్న 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రీతి జింటా పోటీ చేసే అవకాశాలున్నాయట. ప్రీతి జింటా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ పైన పోటీ చేయనున్నారట. ప్రియా దత్ పైన పోటీ చేసేందుకు ప్రీతి జింటాకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ నుండి ఆఫర్ వచ్చిందట. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆమెకు ఆఫర్ చేశారట.

ప్రీతి జింటా

ప్రీతి జింటా

నార్త్ సెంట్రల్ ముంబై లోకసభ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో మున్నాభాయ్ సోదరి ప్రియా దత్ పైన పోటీ చేయాలని రూడీ టిక్కెట్ ఆఫర్ చేశారట.

ప్రియా దత్ పైన

ప్రియా దత్ పైన

ప్రీతి జింటాకు రాజీవ్ ప్రతాప్ రూడీ దూరపు బంధువు అవుతారని సమాచారం. కాగా, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయనున్న ప్రియా దత్ పైన బాలీవుడ్ సెలబ్రటీలనే నిలబెట్టాలని బిజెపి భావిస్తోందట. ఇందులో భాగంగా ప్రీతి జింటాకు టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రీతి ఏం చేస్తుంది

ప్రీతి ఏం చేస్తుంది

ప్రీతి జింటా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిశీలించుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో... ఆమె వాటిని ఖండించారు. ఓ అభిమాని అడగటంతో ఆమె నెట్ ద్వారా స్పందించారు. ఇది ఎక్కడ చదివారని, అది వందశాతం అబద్దమని, ఆ వార్తను చించి వేయాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+