సచిన్ వీడ్కోలు మ్యాచ్: రాహుల్, సాక్షి (పిక్చర్స్)

ముంబై: వెస్టిండీస్‌తో చివరి టెస్టు మ్యాచు ఇంకా జరుగుతున్నప్పటికీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్సు ముగిసినట్లే. భారత్ రెండో ఇన్నింగ్సు ఆడే పరిస్థితి ఉంటే తప్ప సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్సులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ ఇస్తాడేమో చూడాలి.

వెస్టిండీస్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో శుక్రవారం తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన సచిన్ టెండూల్కర్ గురువారం ఉదయం రెండో రోజు ధాటిగానే ఆడాడు. అయితే, అతని ఇన్నింగ్సు 74 పరుగుల స్కోరు వద్ద ముగిసింది. డియోనరైన్ బౌలింగులో అతను అవుటయ్యాడు. సచిన్ టెండూల్కర్‌ను చివరిసారి అవుట్ చేసిన బౌలర్‌గా డియోనరైన్ పేరు కూడా క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రతి షాట్‌ను అభిమానులు ఆనందించారు. 40 ఏళ్ల సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తాడనే అనిపించింది. కానీ, డియోనరైన్ దెబ్బ తీశాడు. కాగా, గురువారంనాడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుండగా ఆయన కుమారుడు అర్జున్ బాల్ బాయ్‌గా విధులు నిర్వహించాడు. తొలి ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా దాన్ని సచిన్ టెండూల్కర్‌కు అంకితం చేశాడు.

ఫైనల్ వాక్..

ఫైనల్ వాక్..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచులో తన చివరి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో 74 పరుగుల వద్ద అవుటై పెవిలియన్‌కు నడుస్తున్న సచిన్ టెండూల్కర్. అభిమానులు, జట్టు సభ్యులు ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

ప్రేక్షకులకు అభివాదం..

ప్రేక్షకులకు అభివాదం..

ప్రేక్షకుల అభినందనలు అందుకుంటూ, అందుకు ప్రతిస్పందనగా సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఊపుతూ భివాదం తెలిపాడు.

బంతిపైనే చూపు..

బంతిపైనే చూపు..

సచిన్ టెండూల్కర్ బంతినే తదేకంగా చూస్తూ షాట్ కొడుతున్న దృశ్యం. అతను 74 పరుగులు చేసి అవుటయ్యాడు.

సచిన్ మెరిపించాడు..

సచిన్ మెరిపించాడు..

సచిన్ టెండూల్కర్ ఆడినంత సేపు ప్రేక్షకులను అలరించాడు. ఏ విధమైన తడబాటు కనిపించలేదు. అర్థ సెంచరీ చేసిన తర్వాత అభివాదం చేస్తూ ఇలా కనిపించాడు.

జట్టు సభ్యులకు..

జట్టు సభ్యులకు..

అర్థ సెంచరీ చేసిన తర్వాత తన జట్టు సభ్యుల వైపు బ్యాట్ ఊపుతూ అభివాదం చేస్తూ సచిన్ టెండూల్కర్ ఇలా..

బాల్ బాయ్ అర్జున్..

బాల్ బాయ్ అర్జున్..

గురువారం రెండో రోజు వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచులో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన తనయుడు అర్జున్ బాల్ బాయ్‌గా వ్యవహరించాడు.

స్టేడియం వెలుపల అభిమానులు

స్టేడియం వెలుపల అభిమానులు

సచిన్ టెండూల్కర్‌ చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియం వెలుపల అభిమానులు ఇలా కనిపించారు.

మాస్టర్‌కు అభినందనలు..

మాస్టర్‌కు అభినందనలు..

హైదరాబాదులోని పాత బస్తీలోని బహదూర్‌పురాలో దిగ్గజం సచిన్ టెండూల్కర్ గౌరవార్థం ఓ అభిమాని క్రికెట్ బ్యాట్, బంతి ఆకారంలో కారును చేసి ప్రదర్శించాడు.

వాంఖడేలో ధోనీ భార్య

వాంఖడేలో ధోనీ భార్య

వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ భార్య సాక్షి ఇలా కనిపించారు.

గార్డ్ ఆఫ్ హానర్..

గార్డ్ ఆఫ్ హానర్..

గురువారంనాడు వెస్టిండీస్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇంగ్లాండు అంపైర్లు వారికి తోడుగా నిలిచారు.

పుజారా సెంచరీ

పుజారా సెంచరీ

గురువారంనాడు భారత ఆటగాడు ఛతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. అతను టెస్టుల్లో నిలకడగా రాణించే ఆటగాడిగా నిలిచాడు.

యాక్షన్‌లో పుజారా..

యాక్షన్‌లో పుజారా..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచులో పుజారా సెంచరీ చేశాడు. అతను 113 పరుగులు చేశాడు.

రాహుల్ గాంధీ వచ్చాడు...

రాహుల్ గాంధీ వచ్చాడు...

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచును చూస్తూ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలా కనిపించాడు.

కోహ్లీ అర్థ సెంచరీ..

కోహ్లీ అర్థ సెంచరీ..

స్టార్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

బ్యాటింగ్‌లో ఓ భాగం

బ్యాటింగ్‌లో ఓ భాగం

సచిన్ టెండూల్కర్ కొట్టిన్ షాట్‌కు గాను వెస్టిండిస్ బౌలర్ టిమ్ సోత్ అలసి పోయి క్రింద పడిన్ దృశ్యం.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

సచిన్ చివరి మ్యాచ్ కావడంతో వీక్షించేందుకు వచ్చిన కాంగ్రెసు పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.

సచిన్ భార్య అంజలితో హృతిక్ రోషన్

సచిన్ భార్య అంజలితో హృతిక్ రోషన్

సచిన్ భార్య అంజలితో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్

సచిన్ అమ్మతో హృతిక్ రోషన్

సచిన్ అమ్మతో హృతిక్ రోషన్

సచిన్ వాళ్ల అమ్మతో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ప్రక్కనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా.

వినమ్రుడై నమస్కారం

వినమ్రుడై నమస్కారం

సచిన్ వాళ్ల అమ్మకు వినయ విధేయతలతో నమస్కారం చేస్తున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+