నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి: టీచర్ రోమియో అరెస్ట్

బెంగళూరు: వ్యాయామ ఉపాధ్యాయుడు నాలుగేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో రెండు రోజుల క్రితం జరిగింది. ఈ సంఘటన ఓ ప్రయివేటు పాఠశాలలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనలో... పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. నిందితుడిని బెంగళూరు పరప్పన అగ్రహార ఠాణా పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. పరప్పన అగ్రహార పరిధిలోని ఓ ప్రైవేటు విద్యాలయంలో మణిపూర్‌కు చెందిన రోమిమో అనే వ్యక్తి వ్యాయామ ఉపాధ్యాయుడిగా నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం చిన్నారిని పాఠశాల ఆవరణలోని క్రీడా సామగ్రి ఉంచే గదికి తీసుకెళ్లాడు.

Physical education teacher held for raping 4 yr old girl

అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికెళ్లిన ఆ చిన్నారి రాత్రంతా ఏడుస్తుండటంతో ఆమె తల్లి ఆరా తీసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి నిర్వాకం బయటపడింది. మంగళవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పాఠశాల యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం వెలుగు చూడటంతో సదరు ఉపాధ్యాయుడు మంగళవారం పాఠశాలకు గైర్హాజరయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+