Pick Talk: మొన్న వర్షంలో తడుస్తూ - ఇవ్వాళ తల్లి షూ లేస్ కడుతూ..!!

బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర- ఇవ్వాళ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ యాత్ర కొనసాగుతోంది. దసరా పండగను పురస్కరించుకుని రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు బ్రేక్ తీసుకున్నారు. ఈ ఉదయం మండ్య జిల్లాలోని పాండవపురాలో యాత్రను పునఃప్రారంభించారు. సోనియాగాంధీ అక్కడే రాహుల్‌ను కలుసుకున్నారు.

కిందటి నెల 30వ తేదీన అడుగు పెట్టారు రాహుల్ గాంధీ కర్ణాటకలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటెలో ఆయన కేరళ సరిహద్దులను దాటారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. భారత్ జోడో యాత్రను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదే స్థాయిలో నిర్వహిస్తోన్నారు. యాత్రను విజయవంతం చేయడానికి కేపీసీసీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Pick Talk: Photo of Rahul Gandhi tied shoe lace of Mother Sonia Gandhi goes viral.

ఇవ్వాళ ఈ యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ సైతం పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సహా పలువురు నాయకులు సోనియాను కలిశారు. సోనియా గాంధీ-రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు.

 Pick Talk: Photo of Rahul Gandhi tied shoe lace of Mother Sonia Gandhi goes viral.

ఇదివరకు మైసూరులో రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభ.. నెటిజన్లను ఆకట్టుకుంది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఫొటోనే ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాదయాత్ర చేస్తోండగా- సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోయింది. దీన్ని గమనించిన రాహుల్ గాంధీ షూ లేస్ కట్టారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది.

 Pick Talk: Photo of Rahul Gandhi tied shoe lace of Mother Sonia Gandhi goes viral.

కాగా- రాహుల్ గాంధీ.. ఎక్కువ సేపు సోనియాను నడవనివ్వలేదు. కొద్దిదూరం వెళ్లిన తరువాత ఆమెను కారులో కూర్చోబెట్టారు. కిందటి నెలలోనే సోనియా గాంధీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీనికోసం ఆమె అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తరువాత కూడా ఆరోగ్య పరమైన సమస్యలు ఆమెను ఇబ్బందులకు గురి చేశాయి. దీనితో రాహుల్ గాంధీ ఎక్కువసేపు నడవనివ్వలేదు. సోనియా అంగీకరించకపోయినా పట్టుబట్టి కారులో కూర్చోబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+