మమత బెనర్జీ లాంటి ప్రధాని కావాలి: హజారే (పిక్చర్స్)
కోల్‌కతా: ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పైన మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె సాధారణ జీవితం తనను ముగ్దుడిని చేసిందన్నారు.
భారత దేశంలో మార్పు రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని, త్వరలో మార్పు వస్తుందన్నారు.
మంగళవారం రాత్రి అన్నా హజారే దీదీ మమతా బెనర్జీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. టిఎంసి ప్రధాన కార్యదర్శి ముఖుల్ రాయ్ నివాసంలో వారు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు...

అన్నా 1
మమతా బెనర్జీని ఉద్దేశించి అన్నా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె జీవితం, ఆమె సాధారణ జీవితం, సాధారణ తిండి తనను ఇంప్రెస్ చేసిందన్నారు. ఆమెకు ఓ ఇళ్లు కానీ కారు కాని లేదన్నారు.

అన్నా 2
చాలాకాలంగా మమతా బెనర్జీ లాంటి నేతను మనం చూడలేదన్నారు. ఇప్పుడు మనకు మమతా బెనర్జీ రూపంలో ఓ మంచి నేత దొరికారని అభిప్రాయపడ్డారు.

అన్నా 3
తాను అన్నా హజారేను గతంలో ఎప్పుడు కలవలేదని, ఇదే మొదటిసారి అని మమతా బెనర్జీ చెప్పారు. ఇటీవల ముఖుల్ రాయ్ ఆయనను కలిశారని, అప్పుడు అన్నా తనను కలవాలనుకున్నారన్నారు.

అన్నా 4
ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పైన మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications