పిక్చర్స్: నరేంద్ర మోడీకి బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఈ జన్మదినం ప్రత్యేక బహుమతిని అందించింది. ఆయన మంగళవారం సెప్టెంబర్ 17వ తేదీన 64వ పడిలో పడ్డారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం నరేంద్ర మోడీ జన్మదినం ఒకే రోజు కావడం విశేషం. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు గుర్తు చేసుకున్నారు.

మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ కూడా తన వైఖరిని మార్చుకున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి సిద్ధపడ్డారు. మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇది మోడీకి అత్యంత సానుకూలమైన విషయమే కాకుండా ఆనందకరమైన విషయం కూడా.

బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నరేంద్ర మోడీ పార్టీని విజయ పథంలో నడిపించడానికి ఇంకా చాలా దూరమే పయనించాల్సి ఉంటుంది. ఆయన నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. ఈ స్థితిలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను గుజరాత్ మాత్రమే కాకుండా దేశమంతా జరుపుకుంది. హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

లక్నోలో...

లక్నోలో...

లక్నోలో మంగళవారం బిజెపి కార్యకర్తలు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు నృత్యాలు చేశారు.

మాతృమూర్తి ఆశీస్సులు..

మాతృమూర్తి ఆశీస్సులు..

గాంధీనగర్‌లోని నివాసంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన తల్లి దీవెనలు తీసుకున్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.

బాల్యంలో నరేంద్ర మోడీ

బాల్యంలో నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ గుజరాత్‌లోని మెహసెనాలో దామోదరదాస్ మూల్‌చంద్ మోడీ, హీరాబెన్ మోడీ దంపతులకు జన్మించారు. బాల్యం నుంచి మోడీ రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించారు.

చాయ్ కార్నర్ నుంచి..

చాయ్ కార్నర్ నుంచి..

నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రస్థానాన్ని చాయ్ కార్నర్ నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన దేశ రాజకీయాల్లో అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా..

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా..

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.

బిజెపిలో అంచెలంచెలుగా..

బిజెపిలో అంచెలంచెలుగా..

బిజెపిలో నరేంద్ర మోడీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఆయన 1995లో బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా..

గుజరాత్ ముఖ్యమంత్రిగా..

కేశూభాయ్ పటేల్ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఉప ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడంతో కేశూభాయ్ పటేల్ గద్దె దిగాల్సి వచ్చింది.

మోడీకి స్పెషల్

మోడీకి స్పెషల్

ప్రధాని అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసిన నేపథ్యంలో నరేంద్ర మోడీ అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

సుదూర పయనం..

సుదూర పయనం..

నామోగా ప్రసిద్ధుడైన నరేంద్ర మోడీ దామోదారదాస్ మోడీ దేశ ప్రధాని పదవిని చేపట్టడానికి ఇంకా చాలా దూరమే పయనించాల్సి ఉంటుంది. తన లక్ష్యాలను నెరవేర్చడానికి సుదూర పయనం సాగించాల్సి ఉంటుంది.

అద్వానీ ఆశీస్సులు..

అద్వానీ ఆశీస్సులు..

బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం శుభసూచకం. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించిన అద్వానీ తన మనసు మార్చుకున్నారు.

ముస్లింల్లో కూడా..

ముస్లింల్లో కూడా..

మోడీపై మతతత్వ ముద్ర క్రమంగా పోతోంది. ముస్లింలు కూడా హిందువులతో సమానంగా ఆయనను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు.

తల్లి కానుక..

తల్లి కానుక..

తన కుమారుడి జన్మదినం సందర్భంగా తల్లి యేటా మోడీకి ఓ మత గ్రంథం ప్రదానం చేస్తుంది. ఆమెకు ఆయన స్వీట్లు తినిపిస్తాడు.

రాజ్‌నాధ్ సింగ్ స్వీట్ తినిపిస్తున్న దృశ్యం

రాజ్‌నాధ్ సింగ్ స్వీట్ తినిపిస్తున్న దృశ్యం

2014 జనరల్ ఎలక్షన్స్‌లో బిజెపి తరుపున ప్రధాన అభ్యర్దిగా నరేంద్ర మోడీని ఆ పార్టీ ఆధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన తర్వాత స్వీట్ తినిపిస్తున్న దృశ్యం.

కేశూభాయ్ పటేల్‌తో నరేంద్ర మోడీ

కేశూభాయ్ పటేల్‌తో నరేంద్ర మోడీ

తన పుట్టిన రోజుని పురస్కరించుకోని శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ పరివర్తన పార్టీ అధ్యక్షుడు కేశూభాయ్ పటేల్‌తో ముచ్చటిస్తున్న దృశ్యం.

తన తల్లి హీరా బాతో

తన తల్లి హీరా బాతో

తన పుట్టినరోజుని పురస్కరించుకోని తన తల్లి హీరా బాతో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ

అహ్మాదాబాద్‌లో నరేంద్ర మోడీ సపోర్టర్లు

అహ్మాదాబాద్‌లో నరేంద్ర మోడీ సపోర్టర్లు

గుజరాత్ రాజధాని అహ్మాదాబాద్‌లో నరేంద్ర మోడీ సపోర్టర్లు భారీ కేకు కట్ చేస్తున్న దృశ్యం.

తన తల్లి హీరా బా స్వీట్ తినిపిస్తున్న దృశ్యం

తన తల్లి హీరా బా స్వీట్ తినిపిస్తున్న దృశ్యం

నరేంద్ర మోడీ తన 64వ పుట్టిన రోజు సందర్బంగా తన తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాత స్వీట్ తినిస్తున్న దృశ్యం.

..తల్లి కానుక..

..తల్లి కానుక..

తన కుమారుడి జన్మదినం సందర్భంగా తన తల్లి హీరా బా భగవత్ గీత ప్రదానం చేసింది.

న్యూఢిల్లీలో

న్యూఢిల్లీలో

2014 జనరల్ ఎలక్షన్స్‌లో బిజెపి తరుపున ప్రధాన అభ్యర్దిగా నరేంద్ర మోడీ ఆరోగ్యం బాగుండాలని ఆ పార్టీకి చెందిన న్యూఢిల్లీ ప్రెసిడెంట్ యాగం నిర్విస్తున్నారు.

మోడీ బర్త్ డే కేక్

మోడీ బర్త్ డే కేక్

బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బిజెపి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బర్త్ డే కేక్‌ను తెప్పించి, కట్ చేశారు.

ఫ్యాన్స్ సందడి

ఫ్యాన్స్ సందడి

బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు.

కిషన్ రెడ్డికి కేక్ తినిపిస్తున్న దత్తాత్రేయ

కిషన్ రెడ్డికి కేక్ తినిపిస్తున్న దత్తాత్రేయ

బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి ఈ సందర్భంగా కేక్ తినిపిస్తున్న సీనియర్ నేత బండారు దత్తాత్రేయ

ముంబైలోని మహిన్ దర్గా వద్ద నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ముస్లింలు కూడా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో 63 కిలోల నరేంద్ర మోడీ కేక్ తయారు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమం వద్ద నరేంద్ర మోడీ సైకత ముఖాన్ని రూపొందించారు. బీహార్ రాజధాని పాట్నాలో సన్యాసులు యజ్ఞం నిర్వహించారు. లక్నో, ఢిల్లీల్లో బిజెపి కార్యకర్తలు మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

కాగా, మోడీ బంగారు వర్ణం కుర్తా ధరించి, గాంధీనగర్‌లోని నివాసంలో 94 ఏళ్ల తల్లి హీరా బా ఆశీస్సులు తీసుకున్నాడు. ప్రజలు ఆయనకు పూలు సమర్పించి, శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి దీవెనలు తీసుకోవడానికి వచ్చానని, అంతకన్నా మించిన గౌరవం మరేమీ ఉండదని మోడీ అన్నారు. ప్రజల ఆశీస్సులు వృధా పోవని, తనకు ఆ నమ్మకం ఉందని, తన పని చేసుకోవడానికి అవి ఎంతో బలాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాని మన్మోహన్ సింగ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+