లేడీ డాక్టర్ కాలర్ సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి
శ్రీనగర్: రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అనుకుంటున్నారా?
బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా వైద్యురాలు తన తెల్లకోటు కాలర్ సరిగా పెట్టుకోక పోవడాన్ని గమనించిన మంత్రి దాన్ని సరిచేశారు.
'బైటియా నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనించిన మరో మహిళా డాక్టర్ తనంతట తానే కాలర్‌ను సరి చేసుకున్నారు. మంత్రి వెంట ఉన్నతాధికారులు ఉన్నారు.

మహిళా డాక్టర్ కాలర్‌ను మంత్రి సరిచేసే సమయంలో అక్కడ చాలా మంది జనం ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, మంత్రి చౌదరీ లాల్ సింగ్ చర్యను నెటిజన్లు తీవ్రంగా తప్పబట్టారు.
ఓ మహిళను ఆమె అనుమతి లేకుండా తాకడం చాలా పెద్ద నేరమంటూ సోషల్ మీడియాలో స్పందించారు. కాగా, మహిళా వైద్యురాలిని మానసికంగా వేధించారని గత ఫిబ్రవరిలో చౌదరీ లాల్ సింగ్ పై ఆరోపణలు వచ్చాయి.
ల్యాబ్ కోటు ధరించలేదంటూ ఆయన ఓ లేడీ డాక్టర్‌ను చివాట్లు పెట్టారు. దీంతో, ఆమె మంత్రి తనను మానసిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపించారు.












Click it and Unblock the Notifications