శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసన: చెన్నైలో తెలుగువాళ్ల కొవ్వొత్తుల ర్యాలీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ లోనే చిత్హూరు జిల్లా శేషాచలం అడవులలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన 20 మంది తమిళ నాడు కూలీల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ తమిళనాడులోని తమిళ సోదరులకు సంఘీభావం ప్రకటిస్తూ చెన్నైలో తెలుగు యువ శక్తి నాయకత్వంలో వందలమంది తెలుగు ప్రజలు ప్రముఖులు యువకలు ఒక కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
మంగళవారంనాడు జరిగిన యీ ర్యాలీలో తమిళనాడు తెలుగు యువత అధ్యక్షుడు శ్రీ కేతి రెడీ జగదీశ్వర రెడ్డి తెలుగు ఐక్యవేదిక , తెలుగు తెర సంఘాల నాయకుడు టంగుటూరి రామకృష్ణ , సౌత్ ఇండియన్ తెలుగు వెల్‌ఫేర్ సంఘం అధ్యక్షుడు డి సాయ్తనారాయణ , ఇజ్రాయిల్ , సీనియర్ పాత్రికేయుడు ఎస్. వి . సూర్య ప్రకాష్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కొందరు రాజకీయస్వార్ధ పరులు ఇక్కడ తెలుగు తమిళ ప్రజల మధ్య విభేధాలు సృస్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శించారు.

కూలీల కుటుంబాలకు అండ
ఎన్‌కౌంటర్ పై వెంటనే ఉన్నత న్యాయ సంఘం చేత దర్యాప్తు చేయించాలని బాధితుల కుటుంబాలకు నస్తా పరిహారం చెల్లించి తమిళ కూలీలకు భద్రత కల్పించాలని వారు డిమ్యాండ్ చేశారు.

ద్వేషం లేదని స్పష్టం
చెన్నైలో దశాబ్దాలు గా ఉంటూ ఇక్కడ అభివృద్డిలో భాగస్వాములైన తెలుగు వారికి తమిళుల పట్ల ఎటువంటి ద్వేషం లేదని వారి కస్టసుఖాల్లో పాలు పంచ్‌కుంటూ ఇక్కడే సోదరూల్లగా గడుపుతూ ఉన్నారని రామకృష్ణ చెప్పారు.

జాతీయ సంపద
అడవులు జాతీయ సంపద అని దానిని కాపాడే బాధ్యతను రెండు రాస్త్రాలు సంయుక్తంగా చేపట్టాలని నేరస్తులను వేటాడే బాధ్యతను రెండు రాస్త్రాల పోలీసులతో ఏర్పాటు చేసిన ఒక సమన్వయ సంఘానికి అప్పగించాలని చెన్నై తెలుగువాళ్లు డిమాండ్ చేశారు.

తీవ్రంగా పరిగణించాలి..
మానవ హక్కుల సమస్యగా కూలీల ఎన్‌కౌంటర్‌ను పరిగణించి ప్రధాన మంత్రి మోడి స్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని వారు డిమాండ్ చేశారు.

సంఘీభావానికి ప్రయత్నం
తమిళ తెలుగు ప్రజల మధ్య సంఘీభావం కాపాడే ఉద్దేశంతో తమిళ ప్రజలకు మద్దతుగా ర్యాలీని చేపట్టామని జగదెశ్వర రెడ్డి చెప్పారు.

గాలింపు ఆపాలి...
రెండు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం సంఘం ఏర్పాటు చేసి నేరగాళ్లను వేటాడాలని, అంతవరకూ ఏకపక్ష కూంబింగ్ కార్యకలాపాలు నిలిపి వేయాలని నాయకులు కోరారు.

కొవ్వొత్తుల ర్యాలీ..
చెన్నైలో తెలుగు యువ శక్తి నాయకత్వంలో వందలమంది తెలుగు ప్రజలు ప్రముఖులు యువకలు ఒక కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.












Click it and Unblock the Notifications