కూలిన చెన్నై భవనం: ఆంధ్ర కూలీలకు శాపం (పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారంనాడు నిర్మాణంలో ఉన్న 11 అంతస్థుల భవనం కూలడం ఆంధ్రప్రదేశ్ కూలీల పాలిట శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికి తీశారు. 22 మందిని కాపాడారు.
శిథిలాలను తొలగించడానికి రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు రాగా, ఐదారు రోజులు పడుతుందని అధికారులు తనతో చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన సోమవారంనాడు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.

చెన్నైలో కూలిన భవనం
చెన్నైలో భవనం కూలిన స్థలాన్ని ముఖ్యమంత్రి జయలిలత సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఆమె పరామర్శించారు.

72 మంది కార్మికులు..
భవనం కూలిన సమయంలో 72 మంది కూలీలు పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలిలత చెప్పారు. ఇప్పటి వరకు 17 శవాలను వెలికి తీశారు. 22 మంది రక్షించారు.

వేయికి మందికి పైగా పనిచేస్తున్నారు..
భవనం కూలిన సంఘటనలో వేయి మందికిపైగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాలను తొలగించడానికి ఐదారు రోజులు పట్టవచ్చునని అంటున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం
భవనం కూలిన సంఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్ర కూలీలు పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ప్రమోటర్స్‌పై కేసు..
భవన నిర్మాణంలో నాణ్యతను, భద్రతను పాటించలేదని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం జరగడం లేదని ఆరోపిస్తూ ప్రమోటర్స్‌పై, ఇంజనీరుపై కేసులు పెట్టారు.












Click it and Unblock the Notifications