షిర్డి సాయిపై వ్యాఖ్యలు: చిక్కుల్లో స్వరూపానంద

భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు స్వరూపానంద సరస్వతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరిపే అవకాశం ఉంది. షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించడం తప్పంటూ కొన్ని రోజుల కిందట శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే పలుచోట్ల ఆయనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. షిర్డీ సాయిబాబా దేవుడు కాడని, సాయిబాబాకు పూజలు చేయవద్దని స్వరూపానంద సరస్వతి సూచించారు.
సాయిబాబా తనకు తాను ముస్లింగా చెప్పుకున్నారని, అలాంటపుడు ఆయన విగ్రహానికి గంగానదిలో పదేపదే స్నానాదికాలు చేయించడమెందుకని ప్రశ్నించారు.
తాను హిందూమత రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. తనను జైలుకు పంపించినప్పటికీ తాను హిందూమతం కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. తాను జైలుకు వెళ్లినా, తన దిష్టిబొమ్మలను దగ్ధం చేసినా తాను హిందూమతం కోసమే తాపత్రయపడతానన్నారు.












Click it and Unblock the Notifications