IPL 2021కు ఎసరు పెట్టిన కరోనా: రద్దుకు: హైకోర్టులో పిల్: 6న విచారణ
ముంబై: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తోడేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL 2021)కు కూడా ఎసరు పెట్టింది. ఇక మెగా క్రికెట్ టోర్నమెంట్ ముందుకు కొనసాగేది కష్టమే. ఏ ముహూర్తంలో 14వ ఎడిషన్‌ను మొదలు పెట్టారో గానీ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐపీఎల్‌నూ వదిలి పెట్టట్లేదు. ఒక్కొక్కరుగా క్రికెటర్లు, సపోర్టింగ్ టీమ్ వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ల పాలవుతున్నారు.
ఈ పరిణామాల మధ్య ఏకంగా టోర్నమెంట్‌ను అర్ధాంతరంగా రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో తాజాగా కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీనితో బుధవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు.

షెడ్యూల్ ప్రకారం.. ఈ మ్యాచ్ దేశ రాజధానిలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ వేదికగా 7:30కు ఆరంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను ముంబైలోని వాంఖెడే స్టేడియానికి తరలించాలంటూ ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ప్రతిపాదించింది. ఈ పరిణామాల మధ్య ఐపీఎల్ 2021ను కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదనే డిమాండ్ ఊపందుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. ఆటగాళ్లు కూడా కరోనా వైరస్ బారిన పడుతోన్న నేపథ్యంలో- ఈ టోర్నమెంట్‌ను వెంటనే రద్దు చేయాలని లేదా.. కనీసం వాయిదా వేయాలని పలువురు డిమాండ్ చేస్తోన్నారు.
ఇదే కారణంతో బోంబే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. క్రికెటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2021 టోర్నమెంట్‌ను తక్షణమే రద్దు చేయడం లేదా వాయిదా వేయించేలా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. బోంబే హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది. ఐపీఎల్ 2021 సీజన్ భవిష్యత్తు ఎలా ఉండోబోతందనేది ఇక బోంబే హైకోర్టు చేతుల్లో ఉంది. కీలక ఆదేశాలు వెలువడే అవకాశాలు లేకపోలేదు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications