విమానంలో పైలట్, ఎయిర్ హోస్టెస్ ఆ పని.. ప్రయాణికులు చూసినా... వీడియో తీసి....

గగనతలంలో ప్రయాణం.. విమానంలో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఓ పైలట్, ఎయిర్ హోస్టెస్ మాత్రం హద్దులు మీరారు. అవును వారిద్దరూ విమానం వెనకసీట్లలో రొమాన్స్ చేశారు. వారి చేష్టలు చూసి ప్రయాణికులు ఖంగుతిన్నారు. బుద్ధిచెప్పాలని భావించి వీడియో కూడా తీశారు. అయినా ఆ జంట సోయి లేకుండా పోయింది. గతనెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంది.

విమానంలో..

విమానంలో..

గతనెలలో ఢిల్లీ నుంచి కోల్‌కతాకు స్పైస్‌జెట్ విమానం ప్రయాణిస్తోంది. విమానం టేకాఫ్ అయ్యింది. ప్రయాణికులు సైలంట్‌గా ఉన్నారు. వెనక సీట్లో మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరిగిందని చూస్తే పైలట్, ఎయిర్‌హోస్టెస్ అసభ్యకర రీతిలో కనిపించారు. ప్రయాణికులను చూసి కూడా వారు ఆగలేదు. వీరికి బుద్ధిచెబుతామని ప్రయాణికులు ప్రణాళిక రచించారు. మరొ సిబ్బంది హద్దుమీరి ప్రవర్తించకుండా చేయాలని భావించారు.

సన్నిహితంగా..

సన్నిహితంగా..

వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశారు. ఆ వీడియోను సేవ్ చేసి.. విమానం కోల్‌కతాలో ల్యాండవగానే ఉన్నతాధికారులకు చూపించారు. ఇదేం ప్రవర్తన అని ప్రశ్నించారు. ప్రయాణికుల ఫిర్యాదును మేనేజ్‌మెంట్ కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇంటర్నల్ కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. ఎవరు వారు, ఏం చేశారని విచారణతో తేలింది. అతను కూడా పైలట్ అని తేలడంతో ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.

అతను పైలటే

అతను పైలటే

ఆ రోజు ఎయిర్‌ హోస్టెస్‌తో ఉన్నది మరో పైలట్ అని తేలింది. అదనపు సిబ్బంది అని వెలుగులోకి వచ్చింది. ఘటనపై స్పైస్ జెట్ యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. విధి నిర్వహణలో అసభ్య ప్రవర్తన సరికాదని స్పష్టంచేసింది. వారిద్దరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నది. ఇలాంటి ఘటన సంస్థకు, ప్రయాణికుల భద్రతను ప్రశ్నించేదిగా ఉంటుందని తెలిపింది.

ఫెయిల్యూర్

ఫెయిల్యూర్

వారిద్దరూ వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూడటంలో విఫలమయ్యారని తెలిపింది. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌గా.. విమానంలో చేయడంపై ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. అందుకే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొన్నది. మరొకరు ఇలాంటి సాహసం చేసేందుకు భయపడాలని, అందుకోసమే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+