ప్రియా ప్రకాశ్ వారియర్ పాటపై కేరళ సిఎం స్పందన: ఇంకేం పనిలేదా అంటూ...
Recommended Video

తిరువనంతపురం: కన్ను గీటి కోట్లాది హృదయాలను దోచుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్‌కు మద్దతుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరయ పూవీ పాట విశేషంగా ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.
ఆ పాటపై వివాదాలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి స్పందించారు. ఆయన దానిపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. అయితే ఆయనపై విమర్శలు కూడా వస్తున్నాయి.

ఓ సినిమా పాటకు స్పందించిన సిఎం..
ఓ సినిమా పాటకు స్పందించిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మిగతా సమస్యలు కనిపించడం లేదా అని సీనియర్ నటుడు, రాజకీయ ఉద్యమకారుడు జాయ్ మాథ్యు ప్రశ్నించారు. మరింత ఘాటుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.

సిఎంకు అవి కనిపించడం లేదా...
"పోలీసు శాఖను తనద వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఓ సినిమా పాట వివాదంపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మద్దతిచ్చారు. కానీ, రాజకీయ హత్యలు ఆయనకు కనిపించడం లేదనుకుంటా. కన్నూర్‌లో కొన్ని రోజుల క్రితం కాంగ్రెసు కార్యకర్లను కొందరు దారుణంగా హత్య చేశారు. వారిని ఇంత వరకు అరెస్టు చేయలేదు. అంటే హంతకులు తప్పించుకుని తిరిగే స్వేచ్ఛను విజయన్ ప్రభుత్వం ప్రసాదించిందా" అని జాయ్ మాథ్యు విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో బోలెడు సమస్యలు
రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని, అనవసరమైన విషయాలపై స్పందించడం మానేసి పనికొచ్చేపనులపై దృష్టి పెడితే మంచిదని మాథ్యూ అన్నారు. "కళలో భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని సహించేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారంనాడు అన్నారు.

దాని గురించి..
పాటపై ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రి గురువారం స్పందిస్తూ - పాట పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించారు. మాప్పిలపట్లు ్నే ముస్లిం సంప్రదాయం పాట ఆధారంగా పిఎంఎ జబ్బర్ రాసిన ఈ పాటను రఫీక్ పాడారు. 1978లోే ఆకాశవాణిలో ఈ పాట ప్రసారమైంది. ఏళ్ల తరబడిగా ముస్లింల వివాహాల్లో ఈ పాటను పాడుతున్నారు కూడా". అని ఆయన అన్నారు.

కొత్తగా దానికి అభ్యంతరం ఏమిటి
"అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఆ పాటపై అభ్యంతరం ఏమిటి. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు. వాటిని నాశనం చేసే ప్రయత్నం మంచిది కాదు" అని విజయన్ అన్నారు.

వివాదాలు సహజమేనని...
వివాదాలు సహజమేనని పాట రాసిన జబ్బర్ అన్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కారణంగా ఆ పాట అంచనాలకు అందని రీతిలో పాపులర్ అయింది. సినిమా నుంచి ఆ పాటను తొలగించాలని కోరుతూ ముస్లిం సంఘాలు సెన్సార్ బోర్డుకు, చిత్ర బృందానికి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖలు రాశాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications