న్యూడ్: అమీర్ పీకే పోస్టర్‌కు బట్టలు తొడిగిన ఎమ్మెల్యే
ముంబై: అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' పోస్టర్లు సృష్టించిన సంచలనంతో పాటు వివాదం అయిన విషయం తెలిసిందే. అమీర్ ఒంటిపై బట్టల్లేకుండా కటి భాగానికి ఓ టేప్ రికార్డర్‌ను అడ్డం పెట్టుకున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ముంబయిలో 'పీకే' పోస్టర్‌కు ఓ ఎమ్మెల్యే బట్టలు తొడిగాడు.
విలేపార్లే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కృష్ణ హెగ్డే పోస్టర్‌కు ఓ టీ షర్టు, నిక్కర్ తగిలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి ఇలాంటి పోకడలు వ్యతిరేకమన్నారు. అమీర్ ఖాన్ ఓ మంచి నటుడని, సత్యమేవ జయతే వంటి కార్యక్రమం నిర్వాహించాడన్నారు. అతడిని ఆదర్శంగా తీసుకున్న ప్రజల ఆలోచనా విధానంపై ఇలాంటి చర్యలతో తప్పుడు ముద్ర వేసినట్టవుతుందన్నారు. కాగా, వివాదంగా నిలిచిన పీకే పోస్టర్ షూటింగ్ రెండేళ్ల క్రితం జరిగిందట.












Click it and Unblock the Notifications