ప్రణాళికా సంఘం పేరు ఇక నీతి ఆయోగ్

న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఉనికిలోకి వచ్చింది. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థ మనుగడలోకి వచ్చింది. ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ అని పేరు పెడుతూ గురువారంనాడు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ అనే పేరు పెట్టడం కొత్త పంథాలో సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రారంభంగా చెబుతున్నారు. కొత్త సంస్థ ఏలా ఉండాలనే విషయంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆ మధ్య ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేశారు.

Planning Commission renamed 'Neeti Ayog'

అధికార వికేంద్రీకరణ జరగాలని సమావేశంలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన ప్రణాళిక సంఘాన్ని మార్చడాన్ని కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. పూర్తిగా దాన్ని రద్దు చేసి, మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి బదులు ఉన్న సంస్థనే పునర్వ్యస్థీకరించాలని వారు అభిప్రాయపడ్డారు.

ప్రణాళిక సంఘం ఏర్పాటు విషయంలో తొలుత నెహ్రూ కూడా ప్రతిఘటన ఎదుర్కున్నారు. అయితే, క్రమంగా అది ఆర్థిక విధానాలను, అభివృద్ధి ప్రణాళకలను రూపొందించి, ముందుకు నడిపించే సంస్థగా రూపుదిద్దుకుంది. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసే సంస్థ విషయంలో సహకార ఫెడరలిజం సూత్రాన్ని అనుసరిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. తన 65 ఏళ్ల చరిత్రలో ప్రణాళికా సంఘం 12 పంచవర్ష ప్రణాళికలను, ఆరు వార్షిక ప్రణాళికలను రూ.200 లక్షల కోట్లతో రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+