బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్ ఎక్కాలంటూ యువతి కాళ్లు మొక్కాడు: అంతలోనే పోలీసు, చివరకు ఏమైందంటే(వీడియో)

ఓ షాపులోంచి బయటికి వచ్చిన యువతిని తన బైక్ ఎక్కాలంటూ ఓ యువకుడు కోరాడు. ఇద్దరూ ఒకరికొకరు పరిచితులుగా ఉన్నప్పటికీ.. ఆ యువతి అతని బైక్‌పై ఎక్కేందుకు నిరాకరించింది. కొంత సేపు వరకూ ఆమెను బలవంతం చేసిన

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఓ షాపులోంచి బయటికి వచ్చిన యువతిని తన బైక్ ఎక్కాలంటూ ఓ యువకుడు కోరాడు. ఇద్దరూ ఒకరికొకరు పరిచితులుగా ఉన్నప్పటికీ.. ఆ యువతి అతని బైక్‌పై ఎక్కేందుకు నిరాకరించింది. కొంత సేపు వరకూ ఆమెను బలవంతం చేసిన ఆ యువకుడు చివరకు ఆమె కాళ్లు పట్టుకున్నాడు. దీంతో ఆమె మనసు కరిగిపోయి అతనితో వెళ్లేందుకు సిద్ధపడింది. బెంగుళూరులోని కత్రిగుప్పే అనే ప్రాంతంలో జరిగిందీ సంఘటన.

సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి షాపు నుంచి బయటికి వెళుతోంది. తన బైకెక్కమంటూ ఆమెను అడ్డుకున్నాడు ఓ యువకుడు. చాలాసేపు ఆమెను బతిమాలాడు. ఎంత చెప్పినా తను ఒప్పుకోడం లేదు.

కాసేపు ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ అలా సైలెంట్‌గా నిల్చున్నారు. ఉన్నట్లుండి ఆ యువకుడు ఆమెను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. తన చేతిని అతడ్నుంచి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న ఆ యువతికి అక్కడే ఉన్న ఓ వ్యక్తి మద్దతుగా నిలిచాడు.

దీంతో యువతి చేయిని విడిచిపెట్టాడు. కానీ, తన ప్రయత్నం మాత్రం మానుకోలేదు. మరింతగా బతిమాలే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ యువతి ససేమిరా అనడంతో ఇక చేసేదేమీ లేక ఒక్కసారిగా ఆమె కాళ్లపై పడ్డాడు. అప్పటి వరకు అతడి నుంచి పారిపోవాలని ప్రయత్నించిన.. యువతి ఆ చర్యతో చలించి పోయి సరేనన్నట్టు కదలకుండా నిల్చుంది.

కొద్ది క్షణాల్లోనే అతడితో వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే, అతడితో వెళుతున్న సమయంలోనే ఓ పోలీసు వచ్చి.. యువకుడి బైక్ తాళాలను తీసుకున్నాడు. ఎందుకు ఏమో గానీ, అక్కడ్నుంచి ఆ యువకుడు పరారయ్యాడు. ఆ తర్వాత ఏమైందో
తెలియాల్సి ఉంది.

English summary
A guy requested a girl to come with him on his bike in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X