ఎన్నో ప్రాణాలు నిల‌బెట్టాడు.. ఇప్పుడు మ‌నువ‌డి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆరాటం

నా మనువుడు ఇప్పుడు తీవ్ర‌మైన స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మవుతున్నాడు. నాకు నెల‌కు కేవ‌లం రూ.6వేల జీతం వ‌స్తుంది. ముగ్గురున్న కుటుంబాన్ని పోషించాలి.

అది డిసెంబ‌ర్ 4, 2017. అప్ప‌టికే హాస్పిట‌ల్‌కు రెండు రౌండ్లు అంబులెన్స్‌ను తీసుకొని వ‌చ్చాను. మూడో సారి కాల్ వ‌చ్చింది. సాధార‌ణంగా ఇలా జ‌ర‌గ‌దు. కాల్ విన‌గానే నా చేతులు వ‌ణ‌క‌సాగాయి. అవ‌త‌ల అందిన స‌మాచారం ఏమిటంటే గ‌ర్భ‌వ‌తిగా ఉన్న మా కూతురు అప‌స్మార‌క స్థితిలో ఉంద‌ని సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ ఒక్క‌టే ఆమెను బ‌తికించ‌గ‌ల‌ద‌ని డాక్ట‌ర్లుచెప్పారు. బిడ్డ ప్రాణాలు చాలా క్లిష్ట‌ప‌రిస్థితిలో ఉన్నాయన్నారు. ఇది మా కూతురి మొద‌టి కాన్పు.

మీరు ఇచ్చే విరాళం రహెమాన్ మనువడిని బతికించగలదు.

ambulance driver raheman

నా పేరు ర‌హెమాన్‌. నేను హైద‌రాబాద్‌లోని గ్లోబ‌ల్ హాస్పిట‌ల్‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాను. రోజూ నేను చేసే ప‌నిలో భాగంగా చాలా స‌హ‌నం పాటిస్తాను. కొంద‌రి ప్రాణాలు నా బాధ్య‌త మీద ఉన్నాయ‌న్న సంగ‌తి గుర్తురాగానే మ‌రింతగా ఓపిక తెచ్చుకుంటాను. చాలా మంది నాకు ఆశీర్వ‌చ‌నాలు ఇస్తుంటారు. అందుకేనేమో నా మ‌నువ‌డు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం బాబును హైద‌రాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్‌లో చేర్చాం. తీవ్ర‌మైన శ్వాస స‌మ‌స్య‌తో పిల్లాడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆక్సిజ‌న్ స‌హ‌కారంతో ఊపిరి తీసుకుంటున్నాడు. బాబును బ‌తికించ‌డానికి డాక్ట‌ర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఆర్థికంగా నేను నా మనువడి కోసం అందిచే స‌హ‌కారం సరిపోవడం లేదు. ఆప‌రేష‌న్‌కు రూ.8.8ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతున్నాయి.

విరాళాల రూపంలో మీరు అందించే స‌హ‌కారం రెహ‌మాన్ మ‌న‌వ‌డిని కాపాడ‌గ‌ల‌దు.

ambulance driver raheman

రోజుకు రూ.10వేల ఖ‌ర్చు

నా మనువుడు ఇప్పుడు తీవ్ర‌మైన స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మవుతున్నాడు. నాకు నెల‌కు కేవ‌లం రూ.6వేల జీతం వ‌స్తుంది. ముగ్గురున్న కుటుంబాన్ని పోషించాలి. మా కుటుంబంలో ఓ సంప్ర‌దాయం ఉంది. మొద‌టి కాన్పున‌కు అయ్యే ఖ‌ర్చంతా అమ్మాయి త‌ర‌ఫు కుటుంబం వాళ్లు భ‌రించాలి. ఇప్ప‌టిదాకా రూ.2.5ల‌క్ష‌ల దాకా జ‌మ‌చేసుకోగ‌లిగాను. స్నేహితులు, బంధువులు బాగానే స‌హ‌క‌రించారు. మా అల్లుడి కుటుంబంవారు పేద‌వారైనా ఎంతో కొంత స‌హాయం చేశారు. ప్ర‌స్తుతం నా మ‌న‌వ‌డిని ఐసీయూలో ఉంచారు. రోజుకు రూ.10వేలు ఖ‌ర్చ‌వుతోంది. నా జీత‌మే ఇంత లేదు. పైగా నేను ఇంటి అద్దె, ఈఎమ్ఐలు క‌ట్టాలి.

ambulance driver raheman

నిద్ర‌లేని రాత్రులు... ఒంట‌రిగా ఏడ్చిన సంద‌ర్భాలు

ఇంత పెద్ద మొత్తం జ‌మ‌చేసేందుకు ఎక్కువ ప‌నిగంట‌లు ప‌నిచేయ‌డం ప్రారంభించాను. రోజుకు 12 గంట‌లు, ఒక్కోసారి వ‌ర‌స‌గా రెండు రోజులు విరామం లేకుండా చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. హాస్పిట‌ల్ బిల్లింగ్ శాఖ నుంచి వ‌చ్చే కాల్స్ అత్యంత వేద‌న‌ను క‌లిగిస్తాయి. ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాను. ఇంతేసి బిల్లులు ఎలా క‌ట్టాల‌న్న‌దే నా సందేహం. ఒంట‌రిగా కూర్చొని ఏడ్చిన సంద‌ర్భాలెన్నో.

ambulance driver raheman

భార్య‌, కూతురితో చెప్పుకోలేను...

నా ఆవేద‌న‌ను ఆసుప‌త్రిలోని స‌హోద్యోగుల‌తో త‌ప్పిస్తే ఎవ‌రితోనూ పంచుకోలేక‌పోతున్నాను. మా కూతురితో చెబుదామంటే ఆమె ఇప్పుడు బాలింత‌. బిడ్డ సంర‌క్ష‌ణచూసుకోవాలే త‌ప్ప ఇత‌ర ఆలోచ‌న‌లేవీ రానీయొద్దు. ఇంట్లో భార్య‌కు చెప్పి క‌న్నీళ్లు తెప్పించ‌ద‌ల్చుకోలేదు. ఆమెతో ఎప్ప‌టిలాగే మాట్లాడుతున్నాను. మా కూతురికి విష‌యం కాస్త అర్థ‌మై చింతిస్తున్నా.. ఆమె ముందుకు వెళ్లే స‌రికి మొహంలో బ‌ల‌వంత‌పు న‌వ్వు తెచ్చుకుంటున్నాను.

ambulance driver raheman

కేజీ బ‌రువు ఉన్నాడంతే..

డ్యూటీ పూర్తి చేసుకోగానే, కూతుర్ని, మ‌న‌వ‌డిని చూసేందుకు వెళ‌తాను. నా మ‌న‌వ‌డు ఇప్పుడు 1కేజీ బ‌రువు మాత్ర‌మే తూగుతూ చాలా బ‌ల‌హీనంగా ఉన్నాడు. ఐసీయూలో మ‌రో 4 నుంచి 5 వారాల పాటు ఉండాలంటున్నారు. అంత డ‌బ్బు ఉంటేనే ఇది సుసాధ్యం అవుతుంది. ఆ దేవుడిని ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల్సిందిగా ప్రార్థిస్తూనే ఉన్నాను. బిడ్డ‌కు ఏం పేరు పెట్టాలో నిర్ణ‌యం తీసుకోలేదు. స‌హాయం చేసిన వారి స్మ‌రనార్థం అత‌డికి పేరు పెట్టడం నాకు ఇష్ట‌మే. నా మనువ‌డి ప్రాణాలు కాపాడ‌డంలో మీ వంతు మ‌ద్ద‌తు ఇస్తార‌ని అనుకుంటున్నాను.

కెట్టో నుంచి రెహ‌మాన్‌కు విరాళాల ద్వారా మీకు తోచినంత స‌హాయం చేయ‌గ‌లరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+