మోడీజీ మా పెళ్ళికి సహాయం చేయండంటూ ఓ యువకుడి లేఖ
తాము పెళ్ళిచేసుకొనేందుకు సహయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. తమ పెళ్ళికి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదన్నారు.
న్యూఢిల్లీ: తాము పెళ్ళిచేసుకొనేందుకు సహయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. తమ పెళ్ళికి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదన్నారు.
ప్రేమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో తమ పెళ్ళికి సహయం చేయాలని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఏకంగా ప్రధానమంత్రి మోడీకే లేఖ రాశాడు.

వివాహం కోసం సహయం చేయాలని లేఖలు రాసిన సందర్భాల్లో మోడీ సానుకూలంగా స్పందించారు. వివాహం కోసం ఆర్థిక సహయం చేయాలని ఆయన అధికారులను ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రేమ వ్యవహరానికి రెండు కుటుంబాల నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఏకంగా మోడీకే లేఖ రాశాడు.
యువకుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అతడి లవర్ నర్సింగ్ పూర్తి చేసింది. అయితే కారణాలు ఏమిటో కాని, ఈ వివాహనికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.












Click it and Unblock the Notifications