రైతులకు దీపావళి కానుక? అక్టోబర్ 30న అన్నదాతల అకౌంట్లలోకి నిధులు!

దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. దీపావళి పండుగ కానుకగా 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకం తదుపరి విడుత సొమ్మును విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.2,000 చొప్పును నేరుగా జమ చేయనున్నారు. యాసంగి(రబీ) పంటల పెట్టుబడికి సరిగ్గా పండుగ ముందు ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!
ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!

ఇ-కేవైసీ, భూమి వివరాల నమోదు తప్పనిసరి
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథక ప్రయోజనం దక్కాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు తమ ఖాతాకు ఇ-కేవీసీ ప్రక్రియను పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావు. కాబట్టి రైతులు వెంటనే తమ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి లేదా పీఎం కిసాన్ పోర్టల్/యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. దీనితో పాటు భూమి వివరాల ధ్రువీకరణ, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం పూర్తయిన వారికి మాత్రమే ఈ విడత సొమ్ము త్వరితగతిని జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

PM-KISAN Update Rs 2 000 Installment Release Date Announced Check eKYC Status Full Details Here

అకౌంట్ ఇ-కేవైసీ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?
మీ ఖాతాకు ఇ-కేవైసీ పూర్తయిందో లేదో అని సందేహం ఉంటే సులభంగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

*ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inను సందర్శించాలి.

*హోంపేజీలో ఉన్న 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

*మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి 'Get OTP'పై క్లిక్ చేయాలి.

*మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ఖాతా వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

మీ ఇ-కేవైసీ వివరాల పక్కన ఆకుపచ్చ టిక్ మార్క్ ఉంటే నిధులు త్వరలోనే జమ అవుతాయని, ఎర్రటి మార్క్ ఉంటే వెంటనే ఇ-కేవైసీ పూర్తి చేయాలని అర్థం.

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!

మీ గ్రామం లబ్ధిదారుల పూర్తి జాబితా పరిశీలించే విధానం
మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ నిధులు అందుతున్నాయో, ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానకి క్రింది విధానాన్ని అనుసరించండి.

* pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'Beneficiary List' బటన్‌పై క్లిక్ చేయాలి.

*ఆ తర్వాత వరుసగా మీ రాష్ట్రం, జిల్లా, సబ్-జిల్లా(మండలం/తాలూకా), బ్లాక్, గ్రామం పేర్లను ఎంచుకోవాలి.

*చివరగా 'Get Report'పై క్లిక్ చేయగానే మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులందరి వివరాలతో కూడిన పూర్తి జాబితా స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+