మోడీ పేరుతో మొబైల్ యాప్: విడుదల చేసిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రజలకు మరింతగా దగ్గరయ్యేందుకు, ఎప్పకప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి గాను ప్రధాని నరేంద్రమోడీ 'నరేంద్రమోడీ మొబైల్ యాప్'ను బుధవారం విడుదల చేశారు.
ఈ యాప్ ద్వారా ప్రధాని మోడీ నుంచి నేరుగా సందేశాలు, ఈమెయిల్స్ పొందుతారు. అంతేకాదు యాప్ ద్వారా మోడీతో ఆలోచనలు పంచుకోవడం, సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది.
'నరేంద్ర మోడీ మొబైల్ యాప్'తో కనెక్ట్ అవ్వమని, సరికొత్త ఫీచర్లతో మొబైల్ యాప్‌ను విడుదల చేశామని, ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోమని మోడీ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేశారు.
Launched 'Narendra Modi Mobile App'. Come, lets stay connected on the mobile! pic.twitter.com/FmHHJSCat8
— Narendra Modi (@narendramodi) June 17, 2015
The Mobile App has several innovative features. You can download it from Play Store. Feedback is welcome. http://t.co/WZ97ypMmlz
— Narendra Modi (@narendramodi) June 17, 2015 











Click it and Unblock the Notifications