PM Modi 3.0: మోడీ కేబినెట్ దాదాపు ఖరారు! తెలంగాణకు 5, ఏపీ నుంచి రెండు బెర్తులు !
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం తర్వాత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోడీ సిద్దమవుతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే ప్రమాణస్వీకారానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే సమయంలో కేబినెట్ లో ఉండబోయే మంత్రులపై జాబితా సిద్ధమైంది. ఇందులో ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దగ్గబోతోంది. రాష్ట్రం నుంచి ఇద్దరికి మోడీ మూడోకేబినెట్ లో చోటు కల్పించబోతున్నారు.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మోడీ ఈసారి కేబినెట్లో చోటు దగ్గబోయే మంత్రుల జాబితా ఇలా ఉంది. కర్నాటక నుంచి కుమారస్వామి, ప్రహ్లాద్ జోషి, బస్వరాజ్ బొమ్మై, గోవింద్ కర్జోల్, పీసీ మోహన్ ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, బీహార్ నుంచి లలన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, సంజయ్ కుమార్ ఝా, రామ్ నాథ్ ఠాకూర్, సునీల్ కుమార్, కుశలేంద్రకుమార్, జీతన్ రామ్ మాంఝీ, రాజ్ నాథ్ సింగ్, జితిన్ ప్రసాద, నిత్యానంద రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజయ్ జైస్వాల్ ఉన్నారు.

మహారాష్ట్ర నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఈటెల రాజేంద్ర, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఉన్నారు. అలాగే ఒడిశా నుంచి ధర్మేంద్ర ప్రధాన్, మన్మోహన్ సమల్ ఉన్నారు. రాజస్థాన్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, దుష్యంత్ సింగ్ ఉన్నారు. కేరళ నుంచి సురేశ్ గోపీ, పశ్చిమబెంగాల్ నుంచి శంతను ఠాకూర్, ఏపీ నుంచి పురందేశ్వరి, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. జమ్మూ నుంచి జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ, ఈశాన్య రాష్ట్రాల నుంచి శర్బానంద సోనోవాల్, బిజులీ కలీత మేదీ , కిరణ్ రిజిజు, బిప్లవ్ దేవ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications