పార్లమెంట్ లో జమిలి బిల్లు వేళ ప్రధాని కీలక పిలుపు..!!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ కీలక పిలుపు ఇచ్చారు. ఇండియా కూటమిని టార్గెట్ చేసారు. ఈ సమావేశాల్లో 16 కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వక్ఫ్ సవరణ.. జమిలి బిల్లును ఈ సమావేశాల్లో నే తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని సూచించారు. ఈ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

ప్రధాని వ్యాఖ్యలు
మహారాష్ట్రలో విజయం తరువాత బీజేపీ ముఖ్యుల్లో జోష్ కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. శీతాకాల సమావేశాలు కావడంతో వాతావరణం చల్లగా ఉంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. విపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేసారు. కొద్దిమంది వ్యక్తులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రస్తావించారు. ఆ వ్యక్తులు తమ బాధ్యతలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్‌లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

PM Modi criticized the INDIA bloc for disrupting parliamentary proceedings ahead of the winter session

టార్గెట్ కాంగ్రెస్
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని ప్రధాని మోదీ గుర్తు చేసారు. పార్లమెంటులో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. సమావేశాల్లో సాను కూల చర్చలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్లమెంటులో వీలైనంత ఎక్కువమంది సభ్యులు చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో అర్ధవం తమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.

ప్రారంభం - వాయిదా
పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు సభా గౌరవ మర్యాదలకు అనుగుణంగా జరగాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలు.. వ్యవహారాలను స్ఫూర్తిగా తీసుకుని సభల్లో మంచి చర్చలు జరపాలని ఎంపీలకు ఓం బిర్లా సూచించారు. పార్లమెంటులో ఏమేం అంశాలు చర్చించాలన్నదానిపై కాంగ్రెస్ ఎంపీలకు నిర్దేశించింది. ఆదానీ వ్యవహారం పై జేపీసీని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే సభ వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+