Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi: గత కాంగ్రెస్ ప్రభుత్వాలే లక్ష్యంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

PM Modi:గత కాంగ్రెస్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజు ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాల గురించి ఆయన ప్రజలకు చెప్పారు. బడ్జెట్ లో ఇచ్చిన ఆదాయపు పన్ను ఉపశమనం గురించి ప్రస్తావిస్తూ.. 'ఈ బడ్జెట్ చూడండి, మీరు నెహ్రూ కాలంలో రూ. 12 లక్షలు సంపాదించి ఉంటే, ప్రభుత్వం మీ జీతంలో నాలుగో వంతు వెనక్కి తీసుకునేది' అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఢిల్లీలోని ఆర్కే పురంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.

ఈ సారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ డిజాస్టర్ పార్టీ 11 ఏళ్లు వృథా చేసిందని విమర్శించారు. ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి, ప్రజలకు సేవ చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ అభ్యర్థించారు. ఢిల్లీలోని ప్రజల సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించడానికి చేయగలిగినదంతా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సాకులు చెప్పే వారికి బదులు ఢిల్లీకి సేవ చేసే, ఢిల్లీని అందంగా తీర్చిదిద్దే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పొరపాటున కూడా ఒక డిజాస్టర్ ప్రభుత్వం ఇక్కడకు రాకూడదన్నారు.

PM Modi Criticizes Past Congress Governments Highlights Budget Benefits

ఎన్నికలకు ముందే చీపురుకట్ట చెల్లాచెదురుగా పడిపోతోందని ప్రధాని మోడీ అన్నారు. 'డిజాస్టర్' నాయకులు ఆ పార్టీని వదిలివెళ్తున్నారని ఆప్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డిజాస్టర్ పార్టీ పట్ల ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో ఆప్ నేతలకు అర్థమైందన్నారు. ఢిల్లీ ప్రజల ఆగ్రహానికి 'డిజాస్టర్' పార్టీ ఎంతగా భయపడిందంటే, గంట గంటకూ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ప్రధాని విమర్శించారు. డిజాస్టర్ పార్టీ అధినేత ముసుగు తొలగిపోయిందంటూ ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. గత పదేళ్లుగా వారు అదే తప్పుడు ప్రకటనలపై మళ్లీ మళ్లీ ఓట్లు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అబద్ధాలను సహించేదే లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఇది మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్.

ఒక వైపు తప్పుడు ప్రకటనలు ఉన్నాయని.. మరోవైపు మీ సేవకుడు మోడీ ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు. మోడీ హామీ అంటే నెరవేరి తీరుతుందని.. మోడీ ఏది చెబితే అది చేస్తారన్నారు. పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని ప్రధాని తెలిపారు. దేశ ఆర్థిక శక్తి పెరగడంతో పాటు పౌరుల ఆదాయం పెరుగుతోందన్నారు. పరిస్థితి గతంలో లాగే ఉంటే దేశంలో పెరుగుతున్న ఆదాయం కొంత మంది చేతుల్లోనే ఉండేదన్నారు. ఈ బడ్జెట్ మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ అని.. దీని అమలు తర్వాత బట్టలు, బూట్లు, టీవీ, మొబైల్ ఫోన్లు వంటి అనేక వస్తువుల తయారీ చౌకగా మారుతుందన్నారు. మేక్ ఇన్ ఇండియాకు ఊతం లభిస్తుందన్నారు. భారతదేశ అభివృద్ధిలో మన మధ్యతరగతి వారి పాత్ర చాలా గొప్పదన్నారు. గతంలో బడ్జెట్ కారణంగా మధ్యతరగతి ప్రజలు నిద్రలేమితో బాధపడేవారని ప్రధాని మోడీ అన్నారు.

సంవత్సరానికి రూ.12 లక్షలు సంపాందించే వారికి ఇంత పెద్ద ఉపశమనం ఎప్పుడూ లభించలేదని ప్రధాని మోడీ అన్నారు. నెహ్రూ కాలంలో రూ.12లక్షలు సంపాదిస్తే ప్రభుత్వం ఆదాయం నాలుగో వంతు తిరిగి తీసుకునేదని.. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రూ.12 లక్షలు సంపాదిస్తే రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చేదని ప్రధాని విమర్శించారు. 10-12 ఏళ్ల క్రితం వరకు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షలు సంపాదిస్తే.. రూ.2,60,000 తిరిగి చెల్లించాల్సి ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+