మోదీ ఆంగ్ల సందేశం వెనుక సీక్రెట్ కోడ్?
దేశ రాజధాని ఢిల్లీని సోమవారం సాయంత్రం ఓ భారీ పేలుడు ఘటన కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత ఈ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్న ఆధారాలన్నీ ఈ కుట్రకు పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉందని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రకటన.. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కీలకంగా మారాయి.
ప్రధాని మోదీ ఆంగ్ల సందేశం.. అంతర్జాతీయ సంకేతం
భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ బాంబు పేలుడుపై స్పందిస్తూ కఠినమైన హెచ్చరిక చేశారు. భారత దర్యాప్తు సంస్థలు కుట్ర మూలాలను ఛేదిస్తాయని.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హిందీలో మాట్లాడారు. అయితే ఆయన అకస్మాత్తుగా ఆంగ్లంలో తేల్చి చెబుతూ: "All Those Responsible Will Be Brought To Justice" (బాధ్యులైన వారందరినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం) అని అన్నారు.
గతంలో పహల్గామ్ దాడి తర్వాత కూడా మోదీ ఇదే తరహాలో హిందీలో మాట్లాడుతూ మధ్యలో ఆంగ్లంలో "India will identify, track, and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth..." (భారత్ ప్రతి ఉగ్రవాదిని, వారి వెనుక ఉన్నవారిని గుర్తించి, వెతికి శిక్షిస్తుంది. వారిని భూమి చివరి కోణంలోనైనా వెంబడిస్తాం) అని ప్రకటించారు. ఆ తర్వాతే 'ఆపరేషన్ సిందూర్' జరిగింది. మోదీ ఇలా ఆంగ్లంలో కఠినమైన ప్రకటన ఇవ్వడం కేవలం దేశానికి కాకుండా.. ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన, కఠినమైన సందేశం ఇవ్వడానికి ఆయన అనుసరించే స్టైల్‌గా రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం?
ఢిల్లీ పేలుడుతో భారత్-పాకిస్థాన్ మధ్య మరో ఉద్రిక్తతకు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణ తర్వాత ఇరు దేశాలు యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ.. అప్పటి నుంచి తరచుగా సైనిక విన్యాసాలు, ఆయుధ పరీక్షలు, NOTAM(నోటం) ప్రకటనలు ఈ ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది. ప్రస్తుతం అసలు ప్రశ్న ఏమిటంటే.. అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య మొదటి దాడి ఎవరు చేస్తారు?
'ఆపరేషన్ సింధూర్' తర్వాత 20 సైనిక విన్యాసాలు
'ఆపరేషన్ సింధూర్' తర్వాత భారత్ తన సైనిక సన్నద్ధతను పెంచింది. కేవలం 6 నెలల్లోనే (మే నుంచి) దాదాపు 20 సైనిక విన్యాసాల్లో పాల్గొంది. అంటే సగటున ప్రతి 10 రోజులకు ఒక విన్యాసం నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వ్యూహాత్మకంగా అనేక విన్యాసాలను ప్లాన్ చేసింది. ఇందులో మే 26న అమెరికాతో చండీగఢ్ ఎయిర్ బేస్‌లో జరిగిన టైగర్ క్లా విన్యాసం ముఖ్యమైనది. అలాగే ఫ్రాన్స్, శ్రీలంక వంటి దేశాలతోనూ డ్రిల్స్ నిర్వహించింది. భారత్ దేశీయంగా సైన్యాన్ని సన్నద్ధం చేయడానికి అనేక విన్యాసాలు చేసింది.
*యుద్ధ కౌశల్ 3.0: ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ విన్యాసం. ఇందులో ఏఐ-ఆధారిత డ్రోన్‌లు, AR/VR వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించారు.
*త్రిశూల్ (Tri-Service Exercise - TSE-2025): భారత నౌకాదళం, సైన్యం, వైమానిక దళం కలిసి రాజస్థాన్‌లోని థార్ ఎడారి, గుజరాత్‌లోని కచ్, ఉత్తర అరేబియా సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.
రాఫెల్, బ్రహ్మోస్, అగ్ని-5 ప్రదర్శన
ఈ అన్ని విన్యాసాలలో 'ఆపరేషన్ సింధూర్'లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆయుధ వ్యవస్థలను ఉపయోగించారు. రాఫెల్, SU-30MKI ఫైటర్ జెట్‌లు, బ్రహ్మోస్ క్షిపణి, హెరాన్ UAV వంటి ఆయుధాలను ఉపయోగించి మూడు దళాల మధ్య సమన్వయం, హైబ్రిడ్ యుద్ధ వ్యూహాలపై దృష్టి పెట్టారు. 5,000 కిలోమీటర్ల పరిధి గల అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని ఒడిశాలోని వీలర్ ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ సైనిక సన్నద్ధత, ప్రధాని మోదీ కఠినమైన సందేశం నేపథ్యంలో, ఢిల్లీ పేలుడుకు భారత్ 'ఆపరేషన్ సిందూర్ 2.0' లాంటి చర్యతోనే సమాధానం ఇస్తుందా అనే ప్రశ్నలు జాతీయ భద్రతా వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications