వందేభారత్ నంబర్ 16: పచ్చజెండా ఊపిన మోదీ- కదలిన రైలు

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో ఆ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 15 రైళ్లు పట్టాలెక్కాయి.

తాజాగా మరో వందేభారత్ ఇవ్వాళ పట్టాలెక్కింది. కేరళలో మొట్టమొదటి సారిగా ఈ రైలు పరుగులు పెడుతోంది. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ మధ్య రాకపోకలు మొదలు పెట్టింది. మొత్తం 11 జిల్లాలు- తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, పథనంథిట్ట, మళప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది.

 modivandebharath

తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ రైలుకు కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, త్రిశూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్, కన్నూర్‌లల్లో హాల్ట్ సౌకర్యం కల్పించారు. కొద్దిసేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీనికోసం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాల్గొన్నారు. రైలులో కొందరు విద్యార్థినులతో ప్రధాని ముచ్చటించారు. స్వచ్ఛభారత్‌పై ఓ విద్యార్థిని- తాను రాసిన కవితను ప్రధానికి చదివి వినిపించారు. ఆ విద్యార్థిని మోదీ ప్రశంసించారు.


అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారాయన. రైల్వేలు దేశాభివృద్ధికి ప్రధాన సూచికలుగా పని చేస్తాయని గుర్తు చేశారు. రవాణారంగంలో స్వయం సమృద్ధిని సాధించామని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్ రైలే.. దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వందే భారత్ రైలు కేరళ పర్యాటకానికి మరింత ఊపు ఇస్తుందని పేర్కొన్నారు.

వందే భారత్ సిరీస్‌లో ఇది 16వ ఎక్స్ ప్రెస్. దీనికి 20633/20634 నంబర్లను దీనికి కేటాయించారు. కాసర్‌గోడ్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్.. అదే రోజు రాత్రి 10:35 నిమిషాలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:20 నిమిషాలకు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:25 నిమిషాలకు కాసర్‌గోడ్‌కు చేరుకుంటుంది. ఛార్జీ-1,520, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీని- 2,815 రూపాయలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+