PM Modi Numerology Secret:కేబినెట్ విస్తరణలో ప్రతీ అంశంలో :అంతా ఏడు తోనే ముడిపెడుతూ..!!
ప్రధాని మోదీ సంఖ్యా శాస్త్రం ఫాలో అవుతారా. అంటే..చాలా మంది తెలియదనే సమాధానం చెబుతారు. అయితే, తాజాగా కేంద్రం కేబినెట్ విస్తరణ విషయంలో మాత్రం ఆయన తీసుకున్న జాగ్రత్తలు.. చేసిన ఎంపికలు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొద్ది కాలంగా మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే చర్చ సాగుతూనే ఉంది. పలు ముహూర్తాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, ప్రధాని మోదీ సడన్ గా ఈ నెల 7వ తేదీని అందుకు ముమూర్తంగా ఎంచుకున్నారు.
ఇది యాధృశ్చికంగా జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా ఈ తేదీని ఎంచుకున్నారా అంటే అదొక్కటే కాదు...ఆయన కేబినెట్ విస్తరణలో పాటించిన అన్ని అంశాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రధానిగా రెండో సారి మోదీ బాధ్యతలు స్వీకరించి జూలై 7వ తేదీకి ఖచ్చితంగా 25 నెలల 7 రోజులు. అంటే..25 నెలలు..2+5 =7. ఇక, విస్తరణ ఖరారు చేసింది 7 వరోజు. ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై మాసం నెంబర్ సైతం 7వ నెల. 7 వ నెల 7వ తేదీ ఆయన విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.

ఇక, తన కేబినెట్ లో ప్లస్ లు...మైనస్ లు..ప్రమోషన్లు వీటన్నింటినీ పక్కన పెడితే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసిన వారి సంఖ్య 43. అంటే అది కూడా 4+3=7. ఇక, ప్రస్తుతం మోదీ తన మంత్రివర్గంలో మహిళలకు ఈ సారి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మోదీ మంత్రి వర్గంలోని మహిళల సంఖ్య సైతం 7. ఇక, ఇప్పుడు మొత్తం మంత్రి మండలి సభ్యుల సంఖ్య 77. తాజా విస్తరణలో పదోన్నతి పొందిన సహాయ-స్వతంత్ర మంత్రుల సంఖ్య సైతం ఏడుగురే.
ఈ కేబినెట్ విస్తరణలో ఉత్తర ప్రదేశ్ నుండి అవకాశం పొందిన వారి సంఖ్య సైతం 7. ఇలా...మోదీ ఎటు నుంచి ఎటు చూసినా తన కేబినెట్ విస్తరణ మొత్తం ఏడు సంఖ్య చుట్టూనే తిప్పారు. దీంతో..ప్రధానికి న్యూమరాలజీ ప్రకారం 7 సంఖ్య కలిసి వస్తుందా అనే చర్చ మొదలైంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల లక్ష్యంగా ఏడుగురికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన మోదీ..మరి..ఈ సంఖ్యా శాస్త్రంతో రానున్న ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications