స్క్వాడ్రన్ లీడర్ సింధురెడ్డికి విషెస్ తెలిపిన రామ్‌ చరణ్ అత్తగారు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఆరంభమైంది. కొద్దిసేపటి కిందటే ఆయన పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నె స్వయంగా ఎయిర్‌‌పోర్ట్‌కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అక్కడే సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ప్రవాస భారతీయులు ఆయనను కలుసుకున్నారు.

మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండురోజుల పాటు కొనసాగుతుంది. బాస్టిల్ డే పరేడ్ సహా వివిధ అధికారిక కార్యక్రమాలు, ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు ఫ్రాన్స్ సెనెట్ చీఫ్ గెరార్డ్ లార్చర్‌తో భేటీ అవుతారు. 7:35 నిమిషాలకు కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొంటారు ప్రధాని మోదీ.

PM Modi France tour: Squadron Leader Sindhu Reddy to lead IAF Contingent at Bastille Day Parade

రాత్రి 9 గంటలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. అనంతరం మోదీ- మాక్రాన్ కలిసి ఈఫిల్ టవర్‌ను సందర్శిస్తారు. మోదీ రాకను పురస్కరించుకుని ఈఫిల్ టవర్ వద్ద భారీ ఎత్తున బాణాసంచాను కాల్చనున్నారు. రెండో రోజు అంటే శుక్రవారం పారిస్‌లో జరిగే బాస్టిల్ డే సెలబ్రేషన్స్‌కు హాజరవుతారు మోదీ.

ఈ ఉత్సవాలకు ఆయనను గౌరవ అతిథిగా ఆహ్వానించింది ఫ్రాన్స్. ఈ సందర్భంగా మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకనుంది ఆ దేశ ప్రభుత్వం. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. మొత్తం 26 రాఫెల్ జెట్ ఫ్లైట్‌ను కొనుగోలు చేయనుంది భారత్. వీటి విలువ 90,000 కోట్ల రూపాయలు.

బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొంటోన్న భారత వైమానిక దళానికి మహిళా పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి నాయకత్వాన్ని వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ మహిళకు ఈ అరుదైన అవకాశం లభించింది. తొమ్మిది సంవత్సరాలుగా భారత వైమానిక దళంలో పని చేస్తోన్నారు సింధు రెడ్డి.

వార్ హెలికాప్టర్ పైలట్, ఎంఐ 17ను నడుపడంలో నిష్ణాతురాలు. ఈ ఏడాది న్యూఢిల్లీలో కన్నుల పండువగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న 144 మంది సభ్యులతో కూడిన వైమానిక దళ బృందానికి కూడా ఆమె నాయకత్వం వహించారు. తాజాగా చారిత్రాత్మకమైన ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనే వైమానిక దళానికి సారథ్యాన్ని వహిస్తోన్నారామె. దీనిపట్ల పలువురు ప్రముఖులు స్పందించారు. సింధురెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు.

అపోలో డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి.. ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. నారిశక్తికి ప్రతీక అంటూ పేర్కొన్నారు. భారత మహిళా శక్తిని సింధురెడ్డి ప్రపంచానికి తెలియజేసే సమయం ఆసన్నమైందని దేశ ప్రజలను గర్వపడేలా చేశారని మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+