మన్మోహన్ సహా ఏ ప్రధానిలోనూ ఆ క్వాలిటీ లేదు: ప్రధాని మోడీపై శరద్ పవార్ ప్రశంసలు

పుణె: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా పని చేయాలనుకుంటే అనుకుంటే.. అది ఖచ్చితంగా పూర్తి చేస్తారని అన్నారు. మహారాష్ట్రలోని పుణెలో మరాఠీ డెయిలీ లోక్‌సత్తా నిర్వహించిన కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొన్నారు.

పాలనపై మంచి పట్టు ఉందంటూ ప్రధాని మోడీపై పవర్ ప్రశంసలు

పాలనపై మంచి పట్టు ఉందంటూ ప్రధాని మోడీపై పవర్ ప్రశంసలు

ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. పనులు పూర్తి చేయడానికి ప్రధాని మోడీ ఎంతో శ్రమిస్తారని, అవి పూర్తయ్యే వరకు సమయం కేటాయిస్తారని చెప్పారు. మోడీ ఏదైనా పని తన చేతిలోకి తీసుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు శ్రమిస్తారు. మధ్యలో ఆపే ప్రసక్తే ఉండదు. మోడీకి పరిపాలనపై మంచి పట్టు ఉందంటూ రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ ప్రశంసలు కురిపించారు.

మోడీని ప్రశంసిస్తూనే విధానాలపై పవార్ చురకలు

మోడీని ప్రశంసిస్తూనే విధానాలపై పవార్ చురకలు

ఇన్నేళ్లలో నాయకుడిగా మోడీలో ఎలాంటి మార్పులను గమనించారనే ప్రశ్నకు ప్రధానమంత్రి పార్టీ బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి అయిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఈ మేకు బదులిచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సామాన్యులకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే, అంతిమ ఫలితాలను విస్మరించలేమని, కష్టపడి పనిచేయడం సరిపోదని పవార్ చురకలంటించారు.

మన్మోహన్ సహా ఏ ప్రధానిలోనూ మోడీకున్న ఆ క్వాలిటీ లేదు

మన్మోహన్ సహా ఏ ప్రధానిలోనూ మోడీకున్న ఆ క్వాలిటీ లేదు

"ఈ అంశంలో, నేను ఒక లోటును చూస్తున్నాను," అని పవార్ చెప్పారు. తన ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పరిపాలన, అతని సహచరులు ఎలా కలిసి రావాలనే దానిపై ప్రధానమంత్రి నొక్కిచెప్పారని అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త పవార్ తెలిపారు. ప్రధాని మోడీ తన సహోద్యోగుల(మంత్రులు, పార్టీ నేతలు)ను తన వెంట తీసుకెళ్లడంలో భిన్నమైన పద్ధతిని కలిగి ఉన్నారని.. అయితే మన్మోహన్ సింగ్ వంటి గత ప్రధానులలో ఆ శైలి కనిపించడం లేదని మాజీ కేంద్ర మంత్రి పవార్ అన్నారు. శివసేన-ఎఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలోని కొంతమంది మంత్రులపై కేంద్ర ఏజెన్సీలు తీసుకున్న చర్యల గురించి, ఈ విషయాన్ని ఎప్పుడైనా ప్రధానితో లేవనెత్తాలనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పవార్ స్పందిస్తూ ఈ విషయంపై తాను ఎప్పుడూ ప్రధాని మోడీతో మాట్లాడలేదని అన్నారు. గతం, భవిష్యత్తులో కూడా అలా చేయనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+