పాక్ పై దాడి చేస్తామని ముందే హింట్ ఇచ్చిన ప్రధాని మోదీ .. వీడియో వైరల్
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు భారత్ చెక్ పెట్టింది. ఉగ్రవాదులను ఉసిగొల్పి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాక్ కు భారత్ మెరుపు దెబ్బ కొట్టింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 70 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు.
అయితే ఈ దాడులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ముందే హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో మరికొద్ది గంటల్లో పాకిస్థాన్ పై దాడులు జరగనున్నట్లు ప్రధాని మోదీ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరికొద్ది గంటల్లో పాకిస్థాన్ పై భారత్ వైమానిక దాడులు ప్రారంభిస్తోందన్న సమయంలో ప్రధాని మోదీ ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఏబీపీ యాజమాన్యంకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాత్రి అయిపోయిందని.. అయినా చాలా మంది వచ్చారని అన్నారు. ఇది ఉజ్వల భవిష్యత్తుకు అర్థం. ఈ రాత్రి ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పుడు ఈ క్లిపింగ్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ నిర్వహించిన దాడుల్లో 9 కీలక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. వాటిలో బహవల్ పూర్ లోని మర్కాజ్ సుభాన్, మురిడ్కేలోని మర్కాజ్ తొయిబా, తెహ్రా కలాన్ లోని సర్జాల్, సియల్ కోట్ లోని మెహ్ మూనా జోయా , బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీత్, కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్, ముజ్ ఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ, ముజ్ ఫరాబాద్ లోని సైద్నా బిలాల్.. లాంటి కీలక ఉగ్రస్థావరాలు ఉన్నాయి.
ఇవన్నీ గతం 30 ఏళ్లుగా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక భారత్ నిర్వహించిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు.
"Mujhe bhi der raat hone wali hai"
— Times Algebra (@TimesAlgebraIND) May 7, 2025
Modiji had dropped a hint last night but no "expert" understood 😂😂 #OperationSindoor pic.twitter.com/MI7PKPGTL4
56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఆయన హస్తం ఉంది. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పథాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి.. తదితర దాడుల్లో ఆయన హస్తం ఉంది.












Click it and Unblock the Notifications