డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మోదీ: దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జ్
Sudarshan Setu: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తోన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు.
తన రెండు రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్‌లో 4,150 కోట్ల రూపాయల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తన పర్యటన సందర్భంగా ఈ ఉదయం చారిత్రాత్మక బెట్ ద్వారక ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. ద్వారక నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ఈ ఆలయాన్నిసందర్శించారు మోదీ. ద్వారకాధీశుడి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఓఖా మెయిల్ ల్యాండ్ నుంచి బెట్ ద్వారకా ఆలయాన్ని సందర్శిస్తూ నిర్మించిర వంతెన ఇది.
మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. 2017లో దీని నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారు. 978 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ సుదర్శన్ సేతు పొడవు 2.32 కిలోమీటర్లు. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ఇదే. ఇదివరకు సిగ్నచర్ బ్రిడ్జిగా గుజరాత్ ప్రభుత్వం పేరు పెట్టింది. దీన్ని మార్చింది కేంద్ర ప్రభుత్వం. సుదర్శన్ సేతుగా నామకరణం చేసింది.
బెట్ ద్వారక ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా వసతిని కల్పించడానికి ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications