సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (pm modi)ఇవాళ పశ్చిమ ఆసియా పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్రాల సంసిద్ధత, ప్రతిస్పందన చర్యలు, ముందస్తు ప్రణాళికలను అంచనా వేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు తమ అత్యవసర వ్యూహాలు, సంసిద్ధతకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రధాని మోడీకి సమర్పించాయి.
హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్‌సాయి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పంజాబ్ భగవంత్ మాన్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సింగ్ సోరెన్. పటేల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాని మోదీతో వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలను ఈ భేటీకి ఆహ్వనించలేదు. ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు క్యాబినెట్ సెక్రటేరియట్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ, భారతదేశంపై దాని ప్రభావం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీలో చర్చిస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణం, రవాణా వంటి అంశాలపైనా వారితో చర్చిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల తలెత్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి రాష్ట్రాల సన్నద్ధతను ప్రధాని మోడీ తెలుసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications