చైనా గడ్డపై మోదీ ల్యాండ్: రెడ్ కార్పెట్ పరిచారు..: ట్రంప్ ముఖచిత్రం ఏంటో?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్ పెట్టనున్నారు ప్రధాని మోదీ. శత్రుదేశం చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటోన్నారు. కొద్దిసేపటి కిందటే చైనాలో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని నేరుగా చైనాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు.

PM Modi Makes Historic Return to China After 7 Years for SCO Summit

ఈ క్రమంలో చైనా సుప్రీమ్ గ్ఝి జిన్ పింగ్ తో ముఖాముఖి భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొననున్నారు. టియాన్జియాన్.. ఈ అత్యున్నత సమ్మిట్ కు వేదిక.

టియాన్జియాన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ఆయనక ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం. ఓ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి ఎయిర్ పోర్ట్ లో రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం అరుదు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద చాలాకాలం పాటు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది.

ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చైనాలో పర్యటించారు. ఆ దేశ పౌరులకు విసాలను సైతం కేంద్రం పునరుద్ధరించింది. డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ చైనా పర్యటన చేపట్టారు. డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+