అర్థమైందా రాజా
New Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బాధ్యతలను అందుకోవడం ఆయనకు ఇది మూడోసారి. తొలి విడతలో 2014 నుంచి 2019 వరకు పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండో విడతలో అయిదు రోజులు మాత్రమే ఈ హోదాలో కొనసాగారు.
ఇప్పుడు మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. మహాయుటి కూటమి నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్‌గఢ్), ప్రమోద్ సావంత్ (గోవా), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా), భూపేంద్ర పటేల్ (గుజరాత్), చంద్రబాబు నాయుడు (ఏపీ), నితీష్ కుమార్ (బిహార్), పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేవేంద్ర ఫడ్నవిస్‌ను తొలుత గవర్నర్ పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. అనంతరం ఫడ్నవిస్ నేరుగా మోదీ వద్దకు వెళ్లారు. శిరస్సు వంచి పాదనమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు మోదీ. చిరునవ్వుతో భుజం తట్టారు.
ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా చంద్రబాబు, నితీష్ కుమార్ వద్దకు వెళ్లారు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొన్ని నిమిషాల పాటు వారితో మాట్లాడారు. ఆ తరువాతే సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను కలిశారాయన.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనతాదళ్ (యునైటెడ్) ఇచ్చే మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ. ఫలితంగా చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లభిస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు, నితీష్ కుమార్‌ను ఢిల్లీకి రావాలంటూ ఆహ్వానించారని తెలుస్తోంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో జమిలి ఎన్నికలకు వెళ్లబోతోంది బీజేపీ. 2027 ఫిబ్రవరి నాటికి జమిలి కోలాహలం నెలకొనే అవకాశం లేకపోలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య దీనిపై చర్చించడానికి ఇద్దరినీ ఢిల్లీకి రావాలంటూ ఆహ్వానించారని అంటున్నారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలన్నింటినీ కూడా సమన్వయం చేసుకోవడం, ఆయా పక్షాల అధినేతలతో సంప్రదింపులు నిర్వహించడం, జమిలి వైపు వారిని కార్యోన్ముఖులను చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు, నితీష్ కుమార్‌కు అప్పగిస్తారని చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications