గ్రామీ అవార్డు విన్నర్ రికీతో ప్రధాని మోడీ భేటీ.. సంగీతం మీ ధ్యాస అంటూ ట్వీట్
బెంగళూరుకు చెందిన రికీ కేజ్ గ్రామీ అవార్డును రెండోసారి కైవసం చేసుకున్నారు. గురువారం రికీ ప్రధాని మోడీ కలిశారు. అవార్డు గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. సంగీతం పట్ల ఉత్సాహం, అభిరుచి మరింత బలపడుతోందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్‌కు రికీ రీ ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం గ్రామీ అవార్డు గెలిచి సందర్భాన్ని తెలియజేశారు. పర్యావరణ హితం కోసం పనిచేయాలని కోరారు. గతంలో జరిగిన విషయాన్ని రికీ గుర్తుచేశారు.
ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ 64వ గ్రామీ అవార్డ్స్ వేడుకలో గ్రామీ అవార్డు గెలుపొందారు. బెస్ట్ న్యూ ఏజ్ మ్యూజిక్ విభాగంలో లెజెండరీ డ్రమ్మర్ స్టీవర్ట్ కోప్ ల్యాండ్‌తో పాటు ఈ అవార్డు గెలుపొందారు. వీరిద్దరూ కలిసి రూపొందించిన 'డివైన్ టైడ్స్' ఆల్బమ్స్ ప్రతిష్టాత్మక అవార్డు తెచ్చిపెట్టింది. ప్రపంచ వేదికపై భారత పతాకం ఎగురవేసిన రిక్కీ కేజ‌్‌ని ప్రధాని మోడీ అభినందించారు.

రూపొందించిన డివైన్ టైడ్స్ ఆల్బమ్ కి గానూ... లివింగ్ లెజెండ్ స్టీవర్ట్ కోప్ ల్యాండ్ తో పాటు గ్రామీ అవార్డు గెలుచుకోవడంతో నా మనసు ప్రేమాభిమానాలతో నిండిపోయిందని రికీ అన్నారు. 64వ గ్రామీ అవార్డ్స్ వేడుక అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరిగింది. ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు గెలుపొందారు. బెస్ట్ న్యూ ఏజ్ మ్యూజిక్ విభాగంలో లెజెండరీ డ్రమ్మర్ స్టీవర్ట్ కోప్ ల్యాండ్ తో పాటు ఈ అవార్డు గెలుపొందారు. వీరిద్దరూ కలిసి రూపొందించిన 'డివైన్ టైడ్స్' ఆల్బమ్స్ అవార్డు వరించింది.












Click it and Unblock the Notifications