నేడు.. ప్రధాని మోదీ జీవితంలో చిరస్మరణీయమైన రోజు- అందుకే..!

అక్టోబర్ 7, 2026.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. సరిగ్గా పాతికేళ్ల కిందట అంటే.. 2001 అక్టోబర్ 7వ తేదీన ఆయన ప్రజా జీవితంలో అడుగు పెట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏకధాటిగా ప్రజా జీవితంలోనే కొనసాగుతున్నారు. అప్పుడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తూనే వస్తోన్నారు. ముఖ్యమంత్రిగా గానీ, ప్రధానిగా గానీ.. ఈ 25 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా విరామం రాలేదు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. కొద్దిసేపటి కిందటే వినాయకుడి ఆలయానికి వెళ్లారు. 140 కోట్లమంది దేశ ప్రజల ప్రతినిధిగా ప్రత్యేక పూజలు చేశారు. శివలింగాన్నిఅభిషేకించారు. నవగ్రహ ప్రదక్షిణం చేశారు. సుమారు 40 నిమిషాల పాటు దైవచింతనలో మునిగిపోయారు. దేశ క్షేమాన్ని కాంక్షించారు. ఢిల్లీ సరోజినీ నగర్ లో ఉంటుందీ ఆలయం. ఈ ప్రత్యేక సందర్భాన్ని వేడుకగా జరుపుకొంటోంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ పేరిట దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తోన్నారు.

pm-modi-offered-prayers-and-performed-aarti-at-shri-vinayak-mandir-in-new-delhi-as-he-marked-25-year

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో మోదీ రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. 2014 మే 22వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. దాదాపు 12 సంవత్సరాల పాటు నిరాటంకంగా పరిపాలన చేశారు. ఆ కాలంలో రాజ్ కోట్ వెస్ట్, మణినగర్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. రాజ్ కోట్ వెస్ట నుంచి ఒకసారి, మణినగర్ నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెరమీదికి వచ్చారు. ప్రచార బాధ్యతలను భుజనవేసుకున్నారు. బీజేపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. అదే ఏడాది మే 26వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం ప్రధానిగా పని చేసిన వారి జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారాయన. 16 సంవత్సరాల 286 రోజుల పాలనతో జవహర్ లాల్ నెహ్రూ అగ్రస్థానంలో ఉన్నారు. 15 సంవత్సరాల 350 రోజులతో ఇందిరాగాంధీ రెండోస్థానంలో ఉన్నారు.

ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సెప్టెంబర్ 17న ఆయన పుట్టినరోజున ప్రారంభించిన నెల రోజుల సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ద్వారా బీజేపీ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, పరిశుభ్రతా కార్యక్రమాలు, సంక్షేమ అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రజా సేవా కార్యక్రమాలను చేపట్టారు ఆ పార్టీ నాయకులు. టార్చ్ మార్చ్‌లు, బైక్/సైకిల్ ర్యాలీలను నిర్వహిస్తోన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా మోదీకి అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+