ముస్లింలకే కాదు.. హిందువులు కూడా జైలుకెళ్తారు: ట్రిపుల్ తలాక్‌పై మోడీ హెచ్చరిక

Recommended Video

    Modi Criticized Congress For Blocking Triple Talaq Bill

    న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఘాటుగా స్పందించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన బిల్లుపై చర్చ జరిగింది.

    ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు. 'ట్రిపుల్ తలాక్' బిల్లు ఏ ఒక్క కమ్యూనిటీనో ఉద్దేశించినది కాదని, ఇదే నేరం కింద హిందూ పురుషులను కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. బిల్లు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణమని అన్నారు.

    PM Modi on triple talaq: Hindus too go to jail for offences

    కాంగ్రెస్ నేతలు ప్రతీదానిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, 'స్వచ్ఛ భారత్', 'మేక్ ఇన్ ఇండియా', 'సర్జికల్ స్ట్రైక్స్, 'యోగా డే'.. ఇలా అన్నింటికీ అడ్డంకులు సృష్టించడమే కాంగ్రెస్ పనంటూ మండిపడ్డారు. వాటిని విమర్శించే స్వేచ్ఛ వారికి ఉందని, అయితే 'ట్రిపుల్ తలాక్' బిల్లుకు రాజ్యంగ హోదా దక్కుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు.

    బిల్లుపై నిర్మాణాత్మక చర్చకు తాము సిద్ధమని మోడీ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరోగ్య కార్యక్రమం 'ఆయుష్మాన్ భవత్'పై అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+