విఠలాచార్యపై మోడీ ప్రశంసలు.. 84 ఏళ్ల వయస్సులో ఏం చేశారంటే..
మంచి పనికి వయసుతో సంబంధం లేదు. ఇదే విషయాన్ని పెద్దలు చెబుతారు. తెలంగాణకు చెందిన ఒకరు చేసి చూపించారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ప్రశంసలతో ముంచెత్తారు. పుస్తకాల గురించి వివరించే క్రమంలో విఠలాచార్య ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని ఉదహరిస్తూ కలను సాకారం చేసుకోవడానికి వయస్సు అడ్డం కాదని మోడీ ఈ సందర్భంగా అన్నారు.
చాలా అసాధారణమైన ప్రతిభలతో దేశం సుసంపన్నమైందని చెప్పారు. ప్రతిభా మూర్తులు.. క్రియేటివిటీ ఇతరులను ప్రేరేపిస్తుందని వివరించారు. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు అని చెప్పారు. 84 సంవత్సరాలు వయస్సు గల ఆయన కలలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనేందుకు ఉదాహరణగా నిలిచారని చెప్పారు. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే విఠలాచార్య చిన్నప్పటి కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు. అతనిని మిగతావారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన కోరిక నెరవేర్చే క్రమంలో విఠలాచార్యకు వయస్సు అడ్డంకి కాలేదని చెప్పారు.

స్వాతంత్ర్యం రాని రోజుల్లో చిన్ననాటి కల కలగానే మిగిలిపోయిందని చెప్పారు. కాలక్రమేణా విఠలాచార్య అధ్యాపకుడు అయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేసి అనేక సృజనాత్మక రచనలు చేశారు. 6-7 సంవత్సరాల క్రితం తన కలను నెరవేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సొంత పుస్తకాలతో లైబ్రరీని ప్రారంభించారు. జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారని వివరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో లైబ్రరీ ఉంది. ఇందులో 2 లక్షల వరకు పుస్తకాలు ఉన్నాయి. చదువుతో మొదలుకొని పలు విషయాల్లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదని విఠలాచార్య అంటారు. అధిక సంఖ్యలో విద్యార్థులు దాని ప్రయోజనాలను పొందడం చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనను స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా లైబ్రరీ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారని ప్రధాని మోడీ అన్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications