దీపావళి వేళ.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బనస్కాంతలో 14,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల కోసం ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకం కింద 24వ విడత నిధులను విడుదల చేశారు. దీని విలువ మొత్తం 18,680 కోట్ల రూపాయలు. ఈ మొత్తంతో కూడిన ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు.

దీనిద్వారా రూ. 2,000 చొప్పున సుమారు 9.34 కోట్లకు పైగా రైతులకు లబ్ది కలిగింది. పంట ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఈ నిధులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ ఖాతాలో రూ.2,000 డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి పీఎం-కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in లేదా మొబైల్ యాప్‌ను వినియోగించుకోవచ్చు.

PM Modi release 24th installment of PM-KISAN amounting to Rs 19000 crore providing financial assist

ముందుగా వెబ్‌సైట్‌ను సందర్శించి హోమ్‌పేజీలో ఉన్న 'నో యువర్ స్టేటస్' (Know Your Status)పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తమ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయగానే పేమెంట్ జమ అయిన వివరాలు, స్టేటస్ ప్రత్యక్షమౌతాయి. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేయడానికి కూడా పోర్టల్‌లో అవకాశం ఉంది.

మియాపూర్ లో 550 ఎకరాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు
మియాపూర్ లో 550 ఎకరాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు

వెబ్‌సైట్‌లోని బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంపిక చేసుకోవాలి. సమాచారం సబ్మిట్ చేసిన వెంటనే ఆ గ్రామానికి చెందిన పూర్తి లబ్ధిదారుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ రాని రైతులు ఇలా తమ వివరాలను తెలుసుకోవచ్చు. పండుగ వేళ పీఎం కిసాన్ సాయం అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు తక్షణ ఆర్థిక ఆసరా లభించినట్లయింది.

తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం

పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించే దిశగా బనస్కాంతలోని భిల్డీ వద్ద 127 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన అత్యాధునిక భారత్ బోవిన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీనితో పాటు బనస్ డైరీకి చెందిన రెండు బయో సీఎన్‌జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. థరద్ లో రోజుకు 75 మెట్రిక్ టన్నులు, రాధన్‌పూర్‌లో రోజుకు 100 మెట్రిక్ టన్నుల బయో కంపోస్ట్ ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2 ఏ, ఫేజ్-2 బీ పనులకు ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. ఇందులో భాగంగా కోటేశ్వర్ రోడ్డు నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ఆరు కిలోమీటర్లకు పైగా అయి స్టేషన్లతో మెట్రో మార్గం నిర్మించనున్నారు. గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.3 కిలోమీటర్ల మేర మూడు స్టేషన్లతో మెట్రో విస్తరణ జరగనుంది. రూ. 2,600 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్-మెహసానా స్టేట్ హైవే-41 ను నాలుగు లేన్ల నుంచి ఎనిమిది లేన్లుగా విస్తరించే పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.

మెరుగైన రైల్వే కనెక్టివిటీని కల్పించడానికి సబర్మతి-వారణాసి ఎక్స్‌ప్రెస్, మెహసానా-బేచరాజీ మెము రైలు సేవలను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారుల సమగ్ర వికాసం, ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించిన రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 4,030 కొత్త మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 361 అంగన్‌వాడీ కేంద్రాలను జాతికి అంకితం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+