ఐరాస వేదికగా ట్రంప్ కు భారత్ బిగ్ షాక్..! మరో 129 దేశాలతో కలిసి..!

భారత్-అమెరికా మధ్య వివిధ రంగాల్లో ఎన్ని బంధాలున్నా అంతర్జాతీయంగా మాత్రం ఎవరికి వారే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఐక్యరాజ్యసమితిలో ఓ కీలక అంశంలో అమెరికా విషయంలో అదే వైఖరి ప్రదర్శించింది. కమ్యూనిస్టు దేశమైన క్యూబాపై ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా వైఖరికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మెజార్టీ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇందులో భారత్ (India) కూడా ఉంది.

'శత్రువుతో చేతులు కలిపేది ఎవరు?'-ఇజ్రాయెల్ లో విధి విచిత్రం..!
'శత్రువుతో చేతులు కలిపేది ఎవరు?'-ఇజ్రాయెల్ లో విధి విచిత్రం..!

క్యూబాపై అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిలో తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. కరేబియన్ దేశం తన అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి వీలుగా ఈ ఆంక్షలను ఎత్తివేయాలని భారత్ తమ వైఖరిని కుండబద్దలు కొట్టేసింది. మొత్తం 193 మంది సభ్యులున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో 130 దేశాలు అనుకూలంగా ఓటేయగా.. మరో 17 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. దీంతో తీర్మానం నెగ్గినట్లయింది.

India Reaffirms Support for Cuba Votes Against US Economic and Trade Restrictions at UN
సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు-డీల్ కూడా లెక్కచేయని హూతీలు..!
సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు-డీల్ కూడా లెక్కచేయని హూతీలు..!

ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ సౌమ్య నాయర్ క్యూబాపై ఆంక్షల ఎత్తివేతకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆమె క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయాలని సర్వసభ్య సమావేశం పదేపదే పిలుపునిచ్చిందని, అలాగే ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని, వారి ప్రజల ప్రగతి, శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేసే, దేశ సరిహద్దులకు అతీతమైన ప్రభావాలు కలిగిన చట్టాలు, నిబంధనలను తిరస్కరించిందని స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితోనే, క్యూబా ప్రజలు అంతర్జాతీయ సహకారంలో మరింత పూర్తిస్థాయిలో పాల్గొనడానికి, వారి చట్టబద్ధమైన అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడటానికి, ఈ ఆంక్షలను వీలైనంత త్వరగా ఎత్తివేస్తారని భారత్ ఆశిస్తోందని ఆమె తెలిపారు.
క్యూబా ఆరోగ్య వ్యవస్థ 60 శాతానికి పైగా నిత్యావసర మందుల కొరతను ఎదుర్కొంటోందని, గత ఐదేళ్లలో ఆహార ఉత్పత్తి 50 శాతానికి పైగా క్షీణించిందని ఆమె గుర్తుచేశారు. 1959లో అమెరికా మద్దతున్న ప్రభుత్వాన్ని కూలదోసి క్యూబాలో ఫిడేల్ క్యాస్ట్రో అధికారం చేపట్టి, సోవియట్ యూనియన్ కు దగ్గర కావడంతో, అప్పటి నుంచి ఆంక్షలతో ఆ దేశాన్ని అగ్రరాజ్యం ఇబ్బంది పెడుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+