యాంటీబయాటిక్స్ వాడేవారు అస్సలు తినకూడని పదార్థాలు!

మనకు ఏ కాస్త ఆరోగ్యం తప్పినా, ఇన్ఫెక్షన్లు వచ్చినా వైద్యులు వెంటనే సూచించేది యాంటీబయాటిక్స్. మందుల చేదును తట్టుకోలేక చాలామంది తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ లేదా కేకులు, స్వీట్లను ఇష్టంగా తింటుంటారు. అయితే, యాంటీబయాటిక్స్ వాడుతున్న సమయంలో ఎక్కువ మోతాదులో షుగర్ తీసుకోవడం వల్ల పొట్టలోని జీర్ణ వ్యవస్థకు కోలుకోలేని తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. మనం తినే తీపి పదార్థాలు యాంటీబయాటిక్స్ చూపే ప్రభావంతో తోడై, జీర్ణకోశంలోని మంచి బ్యాక్టీరియాను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పొట్టలో ఏమవుతుంది?.. షుగర్ ఎలాంటి నష్టం చేస్తుంది?

మన కడుపులో ఆహారాన్ని అరిగించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కోట్లాది మంచి బ్యాక్టీరియాలు నిరంతరం పనిచేస్తుంటాయి. అయితే, మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు అవి హానికరమైన బ్యాక్టీరియాతో పాటు ఈ మంచి బ్యాక్టీరియాను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో మనం తిపి పదార్థాలు తీసుకుంటే, ఆ చక్కెర వల్ల చెడు బ్యాక్టీరియా వేగంగా పెరిగిపోయి మంచి బ్యాక్టీరియా ఉనికికే ముప్పు తెస్తుందని ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'నేచర్'లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.

Eating Sugar While Taking Antibiotics May Worsen Gut Health And Harm Beneficial Bacteria Study Finds
రోజూ దానిమ్మ తింటే మీ గుండెకు ఎంత మేలు జరుగుతుందో తెలుసా?
రోజూ దానిమ్మ తింటే మీ గుండెకు ఎంత మేలు జరుగుతుందో తెలుసా?

ప్రయోగాల్లో దిగ్భ్రాంతికర నిజాలు!

ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్, సిటీ ఆఫ్ హోప్, మెమోరియల్ స్లోన్ కేటరింగ్ పరిశోధకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 173 మంది రోగులు తిన్న దాదాపు 9,419 రకాల ఆహార పదార్థాలను, వారి జీర్ణవ్యవస్థలోని మార్పులను నిశితంగా పరిశీలించారు. ప్రతి 100 గ్రాముల తీపి పదార్థాలు అదనంగా తీసుకున్నప్పుడు, పొట్టలోని మంచి బ్యాక్టీరియా రకాలు దాదాపు 24.1 శాతం పడిపోతున్నట్లు వారు కనుగొన్నారు. అంతేకాకుండా, ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో కూడా యాంటీబయాటిక్స్‌తో పాటు సుక్రోజ్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఎంటెరోకోకస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియా విపరీతంగా పెరిగినట్లు తేలింది.

Underwear Test: వ్యవసాయంలో కొత్త ట్రెండ్, మీ భూమి జాతకం మారాల్సిందే!
Underwear Test: వ్యవసాయంలో కొత్త ట్రెండ్, మీ భూమి జాతకం మారాల్సిందే!

కోలుకోవడానికి ఆహారంలో మార్పులే ముఖ్యం!

యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు వైద్యులు ఇచ్చే డోస్ సూచనలను తేలికగా తీసుకోకూడదని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. మందులు వేసుకుంటున్న రోజుల్లో స్వీట్లు, బేకరీ తినుబండారాలు, అధిక చక్కెర ఉన్న కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. మనం తీసుకునే ఆహారం మనం వాడే మందుల పనితీరును, అలాగే ఒంటికి పట్టే కోలుకునే ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని, కాబట్టి యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తయ్యే వరకు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి క్షేమకరమని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+