వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశీనాథుడి క్షేత్రంలో మోదీ రోడ్ షో : బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు

|
Google Oneindia TeluguNews

వారణాసి : ఆశేష జనవాహిని వెంట రాగా .. కాషాయ వర్ణ ప్రత్యేక వాహనంలో ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతోంది. వారణాసి వాసులు మోదీ రోడ్ షోకు బ్రహ్మరథం పడుతోన్నారు. బెనారస్ హిందూ వర్సిటీ నుంచి మోదీ రోడ్ షో ప్రారంభమైంది. ముస్లింల ప్రాబల్య ప్రాంతాలు మదన్ పురా, సోనార్ పురాతోపాటు 150 ప్రదేశాల గుండా రోడ్ షో కొనసాగుతోంది.

గంగా హారతి
రోడ్ షో ముగిసాక .. కాశీలో గంగా హారతి కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత మూడు వేల మంది ఇంటలెక్చువల్స్ తో మోదీ సమావేశమై ... వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఇవాళ రాత్రి వారణాసిలో బసచేసి ... రేపు నామినేషన్ వేస్తారు. నామినేషన్‌ కార్యక్రమంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సుష్మాస్వరాజ్‌, పీయూష్‌ గోయల్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే, బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌, శిరోమణి అకాళీదళ్‌ చీఫ్‌ ప్రకాశ్‌ బాదల్‌, లోక్‌ జనశక్తి చీఫ్‌ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తదితరులు పాల్గొంటారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

pm modi roadshow at varanasi

అన్నీ తానై ..

మోదీ రోడ్ షో ఏర్పాట్లను బీజేపీ చీఫ్ అమిత్ షా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 6 కిలోమీటర్ల రోడ్ షో కోసం పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇష్టమైన కాశీకి చేరుకొన్నా, ఇక్కడి ప్రజలందరినీ కలుసుకొనే అవకాశం మరొసారి వచ్చింది, హరహర మహాదేవ అని మోదీ ట్వీట్ చేశారు.

English summary
The Modi Road Show started from Benares Hindu Varsity. The Road Show continues through 150 places along with the mythology and sonar myths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X