ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌కి తొలిసారి ప్రధాని మోడీ: పంచాయతీ దినోత్సవం రోజున

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 న జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు లేదా గ్రామ పెద్దలతో నేరుగా సంభాషించడానికి నాయకులు, ఇతరులకు అవకాశం కల్పిస్తుంది.

 PM Modis First Visit To Jammu&Kashmir Since Abrogation Of Article 370 On April 24: Sources

జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2018లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ముగ్గురు సర్పంచ్‌లను చంపడంతో సర్పంచ్‌ల భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించింది.

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది.

కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ- కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. భారతదేశం నుంచి పాకిస్థాన్ 1947లో విభజన జరిగినప్పుడు అప్పటి జమ్మూకాశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ, తరువాత భారత్‌లో విలీనం చేసేందుకు కాశ్మీర్ రాజు అంగీకరించారు. ఆర్టికల్ 370 అంశంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చ జరిపిన అనంతరం రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 370 అంశాన్ని జోడించారు. ఈ ఆర్టికల్ వల్ల భారత రాజ్యాంగం జమ్మూకాశ్మీర్‌కు వర్తించదు. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ, సమాచార మినహా వేరే ఏమైనా చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సమస్య కూడా పెరిగిపోయింది. దీంతో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు, జమ్మూకాశ్మీర్ లో తిరిగి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్.. భారతదేశంలో పూర్తిగా విలీనమైనట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+