ఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియో

Recommended Video

    PM Narendra Modi Tweeted A Video With Hashtag #MainBhiChowkidar | Oneindia Telugu

    న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీలు తమ వ్యుహాలతో ముందుకెళ్తున్నాయి. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఓటర్లను కలువడమే కాదు .. సోషల్ మీడియాలో ప్రకటనలు, వీడియోలు, పోస్టులతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ ఓ వీడియోను విడుదల చేశారు.

    కాపాలదారుడినే ..

    కాపాలదారుడినే ..

    రాఫెల్ యుద్ధ విమానాల కేటాయింపులో కోట్లు చేతులు మారాయని, ప్రధాని మోదీ అనిల్ అంబానీకి మేలు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల ప్రక్రియ కొనసాగుతోంది. దేశానికి కాపాలాగా ఉంటానన్న మోదీ దొంగలతో చేతులు కలిపారని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రతీసారి కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. ఇవాళ 3.45 నిమిషాల నిడివిగల వీడియో సాంగ్ను విడుదల చేశారు.

    #MainBhiChowkidar పేరుతో ట్వీట్

    ప్రధాని మోదీ #MainBhiChowkidar పేరుతో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో బ్లాక్ గ్రౌండ్ పాట ప్లే అవుతోండగా .. మోదీ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీలతో విజువల్ ఉంటుంది. అన్నివర్గాలు, వారి వృతులకు సంబంధించి సాంగ్ లో పొందుపరిచారు. యువత, స్వచ్ఛ భారత్ లాంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో అవినీతిని అంతమొందించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వీడియాలో ప్రధానంగా నేను కాపాలదారుడినే అని మోదీ చెబుతారు. 'మీకు హామీ ఇస్తున్నా, మీ కాపాలదారుడు నిరంతరం అప్రమత్తంగా ఉంటాడు‘ అని మోదీ సందేశం ఉంటుంది.

    2014 నుంచి వెలుగులోకి కాపాలదారు ..

    2014 నుంచి వెలుగులోకి కాపాలదారు ..

    గత సార్వత్రిక ఎన్నికల నుంచి చౌకీదార్, ప్రధాన్ సేవక్ పదాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఇవే ప్రధానాంశాలుగా ప్రస్తావించి .. అధికారం చేపట్టేందుకు దోహదం చేసింది. బహిరంగ సభలు, సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం చేసి .. నేను మీ కాపాలదారుడినని, సేవకుడినని చెప్పుకున్నారు మోదీ. రాఫెల్ యుద్ధ విమానాల కేటాయింపు సందర్భంగా ప్రధాని మోదీపై చౌకీదార్ మాటలనే కాంగ్రెస్ ప్రయోగించింది. కాపాలదారుడే దొంగలతో కలిసిపోయాడని రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను దేశానికి కాపాలదారుడినని చెప్పేందుకు మోదీ ఈ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+