గ్రామీ 2024కు ప్ర‌ధాని పాడిన పాట నామినేట్‌..

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పాడిన అబండెన్స్ ఇన్ మిల్లెట్ పాట గ్రామీ 2024కు నామినేట్ అయ్యింది. ఈ పాట‌లో తృణ ధాన్యాల ప్రాధాన్య‌త‌, లాభాల‌ను వివ‌రించారు. ఈ పాట ఈ ఏడాది జూన్‌లో విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఈ పాట‌లో ప్ర‌ముఖ ఇండో అమెరికన్ గాయ‌ని ఫాల్గుని షా కూడా ఆమె గొంతును క‌లిపారు. ఈ పాట హిందీతో పాటు ఇంగ్లీషులోనూ విడుద‌ల‌య్యింది. ప్ర‌స్తుతం అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి నామినేట్ అయ్యింది. ఐక్యరాజ్య సమితి 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే.

ప్ర‌ధానిని కూడా ఈ పాట‌లో పాడించిన ఫాలూ షా దంప‌తులు: అయితే గ‌తేడాది ఇదే అవార్డును ఫాల్గూణి షా అందుకుంది. ఈ సంద‌ర్భంగానే ఫాల్గూణి షా ఆమె భ‌ర్త గౌర‌వ్ షా ప్ర‌ధానిని క‌ల‌వ‌డం జ‌రిగింది. ఆ స‌మ‌యంలోనే అబండెన్స్ ఇన్ మిల్లెట్‌కు పాట‌కు నాంది ప‌లికారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన సమస్య కోసం ఒక పాటను రాయాల‌ని ప్ర‌ధాని వారిని కోరిన‌ట్లు తెలిసింది. అందుకే ఫాల్గుడి ఈ పాట‌ను రాశార‌ని, స్వ‌యంగా త‌నే ఈ పాట‌ను పాడారని చెప్పారు. అయితే, ఈ పాట‌లో ప్ర‌ధాని కూడా భాగ‌స్వాములవ్వాల‌ని ఫాలూ దంప‌తులు అనుకున్నార‌ట‌.

PM Modis song nominated for Grammy awards 2024

ప్ర‌ధాని మాట్లాడిన మాట‌లే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌: తృణ ధాన్యాలపై పాటలో ప్ర‌ధానిని భాగం చేయాలని అనుకున్నాం. అందుకు ప్ర‌ధాని కూడా సానుకూలంగా స్పందించారు. అయితే మొద‌ట్లో ప్రధానితో కలిసి పాట రాసేందుకు మేం చాలా భయపడ్డాం. కానీ, త‌ర్వాత ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకుండా ఈ పాట‌ను పూర్తిచేయ‌గ‌లిగాం. అయితే, ఈ పాట మధ్యలో ప్రధాని కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాట‌లే ఈ పాట‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయ‌ని అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట విడుద‌ల ఫాల్గూణి షా దంపతులు సందర్భంగా చెప్పుకొచ్చారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+