బంధం మరింత బలోపేతం: జపాన్ కొత్త ప్రధాని కిషదతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ

న్యూఢిల్లీ: జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫుమియో కిషిదతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని మోడీ శుక్రవారం వెల్లడించారు.

భారత్‌-జపాన్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు కిషిదతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అయితే, ఫుమియో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరు ప్రధానులు నేరుగా ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 PM Modi speaks to new Japan PM Fumio Kishida

ఇదిలాఉంటే, కిషిద కంటే ముందు జపాన్‌ ప్రధానమంత్రిగా ఉన్న యోషిహిదె సుగా.. బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే పదవి నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా తిరిగి మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని ప్రకటించారు. గడిచిన ఏడాదిలో ప్రజాదరణ కోల్పోయిన నేతగా సుగా.. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. దీంతో నూతన ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అనంతరం అధికార పార్టీ నాయకుడి ఎంపికలో జపాన్‌ మాజీ విదేశాంగ మంత్రిగా పనిచేసిన పుమియో కిషిద విజయం సాధించారు.

ఈ క్రమంలోనే, జపాన్‌ ప్రధానమంత్రిగా ఇటీవలే ఫుమియో కిషిద బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటులో జరిగిన ఎన్నికలో ఆయన నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. 64 ఏళ్ల కిషిద గతంలో జపాన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే.. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీకి, దాని మిత్రపక్షానికి పార్లమెంటు ఉభయ సభల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో.. ప్రధానమంత్రి పదవికి సోమవారం జరిగిన ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాన్‌స్టిట్యూషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ జపాన్‌ అధినేత యెకియో ఎడానోపై కిషిద సునాయాసంగా విజయం సాధించారు. ఆ వెంటనే ఆయన కొత్త కేబినెట్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ ప్రధానిగా ఉన్న యోషిహిదె సుగా మంత్రివర్గంలో 20 మంది సభ్యులు ఉండగా.. వారిలో కేవలం ఇద్దరినే కిషిద మళ్లీ మంత్రులుగా తీసుకున్నారు. పార్లమెంటు దిగువ సభను రద్దు చేసి.. అక్టోబర్ 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కిషిద తాజాగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+