మహా సీఎం ఫిక్స్: మోదీ ఫోన్ కాల్..!!

Maharashtra Asssembly election results 2024: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటి కూటమి విజయదుందుభి మోగించింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. సాయంత్రానికి ఈ కూటమి అభ్యర్థులు 156 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. మరో 74 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

PM Modi spoke to CM Eknath Shinde and congratulated him

ఈ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలి?, కూటమిలో భాగస్వామిగా ఉంటోన్న మూడు పార్టీలకూ ఎలాంటి పోర్ట్‌ఫోలియోలను కేటాయించాలనే విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ భేటీ ముగిసిన తరువాత ఈ ముగ్గురు నేతలూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరాఠా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చారంటూ కితాబిచ్చారు. ప్రజా సేవకు పునరంకితమౌతామని అన్నారు.

ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్ర నరేంద్ర మోదీ రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏక్‌నాథ్ షిండేకు ఆయన ఫోన్‌ చేశారు. ఈ ఎన్నికల్లో మహాయుటి కూటమిని విజయపథంలో నడిపించినందుకు అభినందనలు తెలిపారు. షిండే జీ.. కంగ్రాచ్యులేషన్ప్ అంటూ ప్రశంసించారు.

అంతకుముందు- ఈ ఎన్నికల ఫలితాలపై మోదీ ట్వీట్ పెట్టారు. అభివృద్ధి, సుపరిపాలన, ఐకమత్యం.. ఈ విజయానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. ఈ మూడింటికీ మహారాష్ట్ర ఓటర్లు పట్టం కట్టారని పేర్కొన్నారు. తమ కూటమి మహారాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు. ఎన్టీఏకు ఓటు వేసినందుకు మరాఠా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+