అది జడ్జిమెంట్ మాత్రమే కాదు..: ప్రధాని మోదీ సంతోషం

Article 370: జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును వెల్లడించింది. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, బీఆర్ గవాయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన అయిదు మంది న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ ఉదయం ఈ తీర్పును వెలువడించింది.

 PM Modi terms Supreme Court verdict on the abrogation of Article 370 as historic

దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. 2019 ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థించినట్లయిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు- ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ ప్రజల ఆశలకు అద్దం పట్టిందని అన్నారు. దేశ పురోగతి, సమైక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ ప్రజల కలలను నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంంలో చిత్తశుద్ధితో పని చేస్తామని తమ నిబద్ధతను చాటుకుంటామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఆర్టికల్ 370 వల్ల నష్టపోయిన బలహీన, అట్టడుగు వర్గాలకు వారి ప్రయోజనాలను అందజేసి తీరుతామని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదని, ఇదొక ఆశాకిరణం అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. దేశ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసినట్టయిందని, సమైక్య దేశాన్ని నిర్మించాలనుకునే దేశ ప్రజల సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు ఊపిరిపోసిందని మోదీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+