వందే భారత్ ప్రయాణికులకు డబుల్ ధమాకా: షిర్డీతో పాటు..!!

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల హవా మొదలైంది. ఒకేసారి రెండు రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ప్రజాదరణను పొందుతోన్నాయి. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- పరుగులు పెడుతోండటంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

అన్ని రకాలా బెనిఫిట్స్..

అన్ని రకాలా బెనిఫిట్స్..

ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.

వందే మెట్రోలు..

వందే మెట్రోలు..

ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- ఇప్పటికే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి సంఖ్యను పెంచనుంది. ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. దీనిపై రైల్వే బోర్డు కసరత్తు సైతం పూర్తి చేసింది. తక్కువ కిలోమీటర్ల దూరంలో రాకపోకలు సాగించడానికి అనువుగా మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది బోగీలు మాత్రమే ఉండేలా దీన్ని డిజైన్ చేసింది రైల్వే బోర్డు.

పట్టాలెక్కనున్న రెండు రైళ్లు..

పట్టాలెక్కనున్న రెండు రైళ్లు..

ఈ పరిణామాల మధ్య తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది. ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించనున్నారు. ముంబైలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 షిర్డీతో పాటు..

షిర్డీతో పాటు..

ఈ రెండు రైళ్లు కూడా మహారాష్ట్రలో తిరుగాడనున్నాయి. ముంబై- సాయినగర్ షిర్డీ, ముంబై-షోలాపూర్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రెండు రైళ్లు కూడా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి ఇప్పటికే పుణే రైల్వే యార్డ్ కు చేరుకున్నాయి. ప్రారంభానికి ఒక్క రోజు ముందు ముంబైకి చేరుకుంటాయి. 10వ తేదీన ఉదయం 9 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ లో వాటిని ప్రారంభిస్తారు.

ముంబై- షోలాపూర్ మధ్య..

ముంబై- షోలాపూర్ మధ్య..

ముంబై- షోలాపూర్ మధ్య వచ్చే అతిపెద్ద భోర్ ఘాట్ ను వందే భారత్ రైలు అధిగమించగలుగుతుందని సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. పుణే మార్గంలో కర్జాత్-ఖండాలా మధ్య ఉంటుందీ భోర్ ఘాట్. దీన్ని అధిరోహించడానికి సాధారణ రైళ్లకు అదనంగా మరో ఇంజిన్ ను అమర్చుతుంటారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు ఆ అవసరం లేదని చెప్పారు. ఇప్పుడున్న ఇంజిన్ సామర్థ్యంతో భోర్ ఘాట్ ను ఈ రైలు అధిగమించగలదని చెప్పారు. ఈ రెండు స్టేషన్ల మధ్య గల దూరం 455 కిలోమీటర్లు. 6.35 నిమిషాల్లో ఈ గమ్యస్థానానికి చేరుతుంది.

ముంబై షిర్డీ మధ్య..

ముంబై షిర్డీ మధ్య..

ముంబై- సాయినగర్ షిర్డీ మధ్య కూడా అత్యంత కఠినమైన థాల్ ఘాట్ ఉంది. ముంబై శివార్లలోని కసరా మీదుగా కొత్త వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య దూరం 340 కిలోమీటర్లు. ముంబై నుంచి బయలుదేరిన 5.25 నిమిషాల్లో ఈ రైలు షిర్డీకి చేరుకుంటుంది. కసరా, ఇగత్‌పురి డివిజన్ల మధ్య థాల్ ఘాట్ విస్తరించి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+