పట్టాలపైకి 6 వందే భారత్ రైళ్లు: రూట్లు ఇవే- మోదీ గ్రీన్ సిగ్నల్
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.

ప్రారంభోత్సవ గుడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధునికీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ (Ayodhya Railway Station) ను ప్రారంభించనున్నారు. దీనితో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటి విలువ 15,000 కోట్ల రూపాయలు.
ఈ ఉదయం 11:15 నిమిషాలకు మోదీ అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ వెంటనే- అమృత్ భారత్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపుతారు. రామాయణం థీమ్‌తో ఈ స్టేషన్ రూపుదిద్దుకుంది. అందులోని ప్రధాన ఘట్టాలను అయోధ్య స్టేషన్ గోడలపై చిత్రీకరించారు.
ఈ స్టేషన్‌కు అయోధ్య ధామ్ అని పేరు పెట్టింది రైల్వే మంత్రిత్వ శాఖ. రామమందిరం ప్రారంభం తరువాత.. అయోధ్యకు భక్తులు, సందర్శకుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఈ స్టేషన్‌ను ఆధునికీకరించింది. దీనికోసం 240 కోట్ల రూపాయలను వ్యయం చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ.

అక్కడే ఆరు వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు మోదీ. శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా- న్యూఢిల్లీ, అమృత్‌సర్- ఢిల్లీ, కోయంబత్తూర్-బెంగళూరు కంటోన్మెంట్, మంగళూరు-మడ్గావ్, జాల్నా-ముంబై, అయోధ్య- ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య ఆయా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
మధ్యాహ్నం ఒంటిగంటకు అయోధ్య విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభిస్తారు. జాతికి అంకితం ఇస్తారు. 6,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మితమైంది. అత్యంత ఆధునికంగా దీన్ని నిర్మించింది కేంద్రం. దీని నిర్మాణ వ్యయం 1,450 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో ఇది నిర్మితమైంది.












Click it and Unblock the Notifications