ఒక్కో మహిళ అకౌంట్లో రూ.10వేలు- మహిళలకు మోదీ దసరా గిఫ్ట్..!!
ప్రధాని మోదీ మరో ఆకర్షణీయ పథకం ప్రారంభించారు. త్వరలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికల పైన మోదీ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా మహిళా ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టారు. వచ్చే నెలలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. సమయంలో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మహిళల సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను వివరించారు.
బీహార్ లో ఎన్నికల ముహూర్తం దగ్గర పడింది. వచ్చే నెల తొలి వారంలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. దీంతో, మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.7,500 కోట్లతో రూపొందించిన ఈ పథకాన్ని ప్రధాని దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. అనంతరం మాట్లాడిన మోదీ గతంలో ఆర్జేడీ పాలనలో మహిళలు చాలా బాధలు పడ్డారని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వారి పాలనలో శాంతిభద్రతలు దయనీయంగా ఉండేవని డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రధాని చెప్పుకొచ్చారు.

కాగా, బీహార్‌లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలకు ప్రధాని కోరారు. ఈ పథకం గురించిన తనకు చెప్పినప్పుడు దాని విజన్‌ను చూసి తాను చాలా సంతోషించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ కచ్చితంగా ఈ పథకం వల్ల ప్రయోజనాన్ని పొందుతుందని వివరించారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం, కేంద్ర లఖ్‌పతి దీదీ అభియాన్‌కు కొత్త బలాన్ని ఇస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు, ఆమెకు నచ్చిన జీవనోపాధి కార్యకలాపాల కోసం ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. దీని వల్ల ఆమెకు సామాజిక సాధికారత, ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తాయి. ఈ స్కీమ్‌లో మొదటగా ప్రతి లబ్ధిదారుకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కింద రూ.10వేలు అందిస్తారని చెప్పారు. తదుపరి దశల్లో వారు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుందని ప్రధాని వెల్లడించారు.












Click it and Unblock the Notifications